Sarpanch | గెలుపు దిశగా శనిగరపు మల్లేశం..

Sarpanch | గెలుపు దిశగా శనిగరపు మల్లేశం..
- అన్ని వర్గాల ప్రజల మద్దతు
Sarpanch | జగిత్యాల జిల్లా గొల్లపల్లి, ఆంధ్రప్రభ : మండలంలోని శ్రీరాములపల్లి గ్రామంలో సర్పంచ్ స్థానానికి పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శనిగరపు మల్లేశం విజయం తధ్యమని గ్రామస్తులు చెబుతున్నారు. గతంలో సర్పంచిగా పనిచేసిన మల్లేశం అన్ని వర్గాల ప్రజలకు ఎన లేని సేవ చేశారు. దాంతో శ్రీరాములపల్లి గ్రామ ప్రజల్లో మల్లేశం గెలుపు కోసం కృషి చేస్తున్నారు. మంత్రి లక్ష్మణ్ కుమార్ అండదండలతో గ్రామంలోని సమస్యలన్నీ పరిష్కరిస్తాననీ గ్రామస్తులకు హామీ ఇస్తున్నాడు. తన కత్తెర గుర్తుపై ఓటు వేసి మెజార్టీతో గెలిపించాలని మల్లేశం కోరుతున్నారు.

