Sarpanch | ఎంపీటీసీగా అనుభవముంది…

Sarpanch | ఎంపీటీసీగా అనుభవముంది…


సర్పంచ్ గా గెలిపించండి
Sarpanch | ఎడ‌ప‌ల్లి, ఆంధ్రప్రభ : ఎడపల్లి మండలం మంగళ్ పహాడ్ గ్రామంలో ఎంపీటీసీగా అనుభ‌వ‌ముంది… స‌ర్పంచ్ గా గెలిపించండి అంటూ సర్పంచ్ అభ్యర్థి అరుగుల వనజా నాగరాజు కోరారు. గ్రామంలో ఇంటింటి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ అభ్యర్థి ఎన్నికల అధికారులు కేటాయించిన ఉంగరం గుర్తుకు గ్రామ ఓటర్లు ఓటు వేయాలని సూచించారు.

ఇదివరకు ఎంపీటీసీగా గ్రామ ప్రజలకు సహాయ సహకారాలు అందించడం జరిగిందని, అదే అనుభవంతో గ్రామ సర్పంచ్ గా సైతం గెలిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేస్తానన్నారు. గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని, గ్రామంలో తాగునీటి సమస్య డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరుస్తానన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మద్దతుదారులు పాల్గొన్నారు.

Leave a Reply