Saraswati Pushkaras | ఎనిమిదో రోజూ అదే భక్త జన ప్రవాహం

కాళేశ్వరం – సరస్వతి నదీ పుష్కర మహోత్సవాల్లో భాగంగా గురువారం 8వ రోజు ఘనంగా కొనసాగుతోంది. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున మన రాష్ట్రం నుండే కాక ఇతర రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున తరలి వచ్చి పుష్కర స్నానాలు ఆచరిస్తున్నారు. పుణ్యస్నానాలు, ప్రత్యేక పూజలు, హారతులతో ఘాట్‌ల పరిసరాలు భక్తిశ్రద్ధలతో మార్మోగుతున్నాయి. భక్తులు అమ్మవారి దర్శనార్థం బారీ క్యూలైన్లలో నిలబడి భక్తిని చాటుకుంటున్నారు. పుష్కర స్నానానికి భద్రతా దళాలు, పోలీసు సిబ్బంది, వైద్య సిబ్బంది సహా వాలంటీర్లు సమర్థంగా సేవలందిస్తున్నారు.


భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో, అధికారులు అదనపు ఏర్పాట్లు చేపట్టారు. ట్రాఫిక్ నియంత్రణ, నీటి సరఫరా, వైద్య సహాయ కేంద్రాలు, విస్తృతంగా అందుబాటులో తెచ్చారు. పుష్కరాల ముగింపుకు ఇంకా 4 రోజులు సమయం ఉన్నందున భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో యంత్రాంగం అన్ని ఏర్పాట్లు లో నిమగ్నమయ్యారు. భక్తులు పుష్కరాల్లో పాల్గొనాలని, సూచించిన మార్గదర్శకాలను పాటించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ విజ్ఞప్తి చేశారు.

Leave a Reply