sankranti 2026 | ఒకే రోజు 3 ఈవెంట్లు..

sankranti 2026 | ఒకే రోజు 3 ఈవెంట్లు..
sankranti 2026 | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : సంక్రాంతి వస్తుందంటే.. సినిమాల పండగ వస్తున్నట్టే.. సంక్రాంతికి సినిమాలు రిలీజ్ చేస్తే.. రెగ్యులర్ గా వచ్చే కలెక్షన్స్ కంటే ఎక్కువ కలెక్షన్స్ వస్తాయి. అందుకనే.. సంక్రాంతికి సినిమాలు రిలీజ్ (Release) చేయడానికి స్టార్ హీరోలు, దర్శకనిర్మాతలు పోటీపడుతుంటారు. ఈసారి సంక్రాంతికి పోటీ మామూలుగా లేదు. భారీ సినిమాలు, మీడియం రేంజ్ సినిమాలు పోటీపడుతుండడంతో రసవత్తరంగా మారింది. ఇప్పుడు ప్రమోషన్స్ లో కూడా ఈ సినిమాలు పోటీపడుతుండడం విశేషం. ఒకే రోజు 2 ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ.. ఆ మూడు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఏంటి..? ఎప్పుడు..?
sankranti 2026 | సంక్రాంతి సందడి..
ఈ సంక్రాంతి కానుకగా తెలుగులో బాక్సాఫీస్ దగ్గర సందడి చేసేందుకు సినిమాలు రెడీ అయ్యాయి. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ మూవీ ముందుగా జనవరి 9న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇక ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) నటించిన మన శంకర వరప్రసాద్ గారు జనవరి 12న రిలీజ్ కానుంది. మాస్ మహా రాజా రవితేజ నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా జనవరి 13న.. నవీన్ పొలిశెట్టి నటించిన అనగనగా ఒక రాజు, శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి చిత్రాలు జనవరి 14న వరుసగా రిలీజ్ కానున్నాయి. ఈ సినిమాలకు సంబంధించిన ప్రమోషన్స్ కూడా జోరుగా జరుగుతున్నాయి.

sankranti 2026 | చిరు, రవితేజ, నవీన్ పొలిశెట్టి..
అయితే.. ఇంట్రెస్టింగ్ గా ఒకే రోజు మూడు చిత్రాలకు సంబంధించిన గ్రాండ్ ఈవెంట్స్ జరగనుండటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. ఇంతకీ ఆ మూడు సినిమాలు ఏంటంటే.. రవితేజ (Raviteja) భర్త మహాశయులకు విజ్ఞప్తి ట్రైలర్‌ను జనవరి 7న సాయంత్రం 4.05 గంటలకు రిలీజ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఈవెంట్ ఏఆర్‌టి సినిమాస్‌లో జరగనుంది. ఇక అదే రోజు సాయంత్రం 6.04 గంటలకు నవీన్ పొలిశెట్టి అనగనగా ఒక రాజు ట్రైలర్ రిలీజ్ కానుంది. రాత్రి 7 గంటలకు మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న మన శంకర వరప్రసాద్ గారు ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించబోతున్నారు. ఇలా.. మూడు భారీ ఈవెంట్స్ ఒకే రోజు జరుగుతుండటంతో ఆసక్తిగా మారింది.

CLICK HERE TO READ కళ్యాణి ప్రియదర్శన్ కి.. అక్కడ కలిసొచ్చేనా..?
