చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైన పాశం సంజయ్ బాబు ముదిరాజ్ శనివారం రాష్ట్ర మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి శాలువా కప్పి సన్మానించారు. తన ఎన్నికకు సహకరించిన మంత్రి ఉత్తంకుమార్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దుబ్బాక నరసింహారెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకులు ఏలమోని శ్రీకాంత్, గంగానమోని శ్రావణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
మంత్రి ఉత్తమ్ ను కలిసిన పాశం సంజయ్ బాబు

