లోలెవల్ బ్రిడ్జిపై వరద నీరు
తిమ్మాపూర్, ఆంధ్రప్రభ : కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పోలంపల్లి గ్రామంలో లోలెవల్ వంతెనపై వరద నీరు పారుతోంది. పొలంపెళ్లి ఎస్సీ కాలనీ ఆనుకొని ఉన్నలో లెవెల్ బ్రిడ్జి అడుగుభాగం పూర్తిగా కొట్టుకుపోవడంతో అందులో ఇసుక ట్రాక్టర్ దిగబడిపోయింది. అయితే ఎటూ కదలేక అక్కడే ఉండిపోయింది. ఇది గమనించి డ్రైవర్ వరద నీటి నుంచి బయటపడ్డాడు. ఈ బ్రిడ్జి కూలిపోవడంతో మొగిలిపాలెం, పోలంపల్లి రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో మానకొండూర్ , ముంజంపల్లి , మన్నెంపెళ్లి , పోలంపల్లి , బొమ్మనపల్లి హుస్నాబాద్ లకు రాకపోకలకు అంతరాయం కలిగింది.

