Sand Drought : ఇసుకే బంగారమయ్యేనే.. AndhraPrabha Spl Story  

Sand Drought :  ఇసుకే బంగారమయ్యేనే .. AndhraPrabha Spl Story

ఏడారి దేశాల్లో  తిమిరం కరువు

అద్భుత కట్టడాల్లో  అరబ్ కంట్రీలు  బిజీబిజీ

గండ్ర ఇసుక కోసం.. దుబాయ్​ అన్వేషణ

ఇప్పటికే ఆస్ట్రేలియా..చైనా.. వియత్నాం వైపు చూపు

ధర తక్కువే.. దారి ఖర్చే మోపెడు

భవిష్యత్తులో మరింత ఇసుక అవసరం

Sand Drought ( ఆంధ్రప్రభ, స్పెషల్​ డెస్క్)​ ఇసుక నుంచి తైలం తీయటం ఎంత తేలికో.. అరబ్​ దేశాలకు తెలుసు. అందుకే ప్రపంచంలోనే సుసంపన్న దేశాలుగా అరబ్​ కంట్రీస్​ అవతరించాయి. కానీ.. ఇప్పుడు కనుచూపు మేరలో ఇసుక తెన్నెలు పలకరిస్తున్నా… ఈ దేశాలు ఇసుక కోసం పరాయి దేశాలను ప్రాధేయపడే స్థితి ఏర్పడింది.  నిజమే.. ఎడారి సముద్రంలో  ఇప్పుడు గుక్కెడు నీటి కొరత లేదు. మినరల్ వాటర్​ బాటిల్​ ను పైకి ఎత్తి గటగటా గుటక వేయటం పెద్ద కష్టం కాదు..

Sand Drought

కానీ  ఈ తిమిర (Sand)  సామ్రాజ్యంలో ఇసుక కరవు (Sand Drought)  ఏర్పడింది. ఔనా.. అదెట్లా అంటే.. ప్రస్తుతం దుబాయ్​ని పరిశీలిద్దాం. ఇక్కడ చమురు దందాతో గల్లా పెట్టెలన్నీ గలగల మంటుంటే.. అందమైన లోకాన్ని  సృష్టించే పనిలో అటు విశ్వకర్మ.. ఇటు ​  మయాసురుడు నిమగ్నమైతే.. ఎలా ఉంటుందో..

దుబాయ్​ భవన నిర్మాణ రంగం నిరూపిస్తుంది. ప్రస్తుతం దుబాయ్​ లో 330 భారీ ప్రాజెక్టులు భూలోక సర్గ నిర్మాణంలో బిజీబిజీగా ఉన్నాయి. ఇందులో ₹1,60,000 కోట్ల అంచనాతో..   దుబాయ్ క్రీక్ టవర్, బుర్జ్ అజీజీ, పామ్ జెబెల్ అలీ,  దుబాయ్ మెట్రో బ్లూ లైన్  తదితర మెగా ప్రాజెక్టులన్నీ శరవేగంతో పరుగులు తీస్తున్నాయి.  ఈ ప్రాజెక్టుల్లో కాంక్రీట్​ పనులకు ఇసుక చాలా అవసరం. కానీ.. ఇక్కడే చిన్న తిరకాసు ఉంది.

 Sand Drought :  మెగా ప్రాజెక్టుల కళ..

Sand Drought

పామ్ జెబెల్ అలీ (Palm Jebel Ali) ప్రాజెక్టు. పామ్ జుమేరా తరహాలోనే భారీ కృత్రిమ   $10 బిలియన్లు (₹ 89,000 కోట్లు) అంచనాతో పనులు ప్రారంభించారు. – 2030 (దశలవారీగా)నాటికి పూర్తి చేయాలి.  2025లో విల్లాల నిర్మాణం మొదలైంది. ప్రస్తుతం మౌలిక సదుపాయాల పనులు జరుగుతున్నాయి.

Sand Drought

బుర్జ్ బింఘట్టి (Burj Binghatti)  ఇది ప్రపంచంలోనే ఎత్తైన నివాస భవనం (Jacob & Co Residences). నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. దీని అంచనా వ్యయం $1 బిలియన్ (₹8,900 కోట్లు)          2026 చివరిలోపు ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలి.

బుర్జ్ అజీజీ (Burj Azizi) ఇది ప్రపంచంలో రెండవ అత్యంత ఎత్తైన భవనం. దీన్ని 725 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తున్నారు.   పునాది పనులు  పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్టు వ్యయం  $1.5 బిలియన్ (₹13,500 కోట్లు) 2028 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలి.

Sand Drought

దుబాయ్ క్రీక్ టవర్ (Dubai Creek Tower) ప్రాజెక్టు అంచనా    $1 బిలియన్+ (₹8,900 కోట్లు+). ఇది బుర్జ్ ఖలీఫా టవర్​  కంటే ఎత్తుగా   రూపొంచారు.  ఈ ప్రాజెక్టు డిజైన్‌ను మార్చారు. దీని పనులు 2025 జనవరిలో పునఃప్రారంభించారు.  

దుబాయ్ మెట్రో బ్లూ లైన్   

Sand Drought

దుబాయ్​ లో రవాణా వ్యవస్థను మెరుగు పర్చేందుకు  దుబాయ్ మెట్రో బ్లూ లైన్   ప్రాజెక్ట్  చేపట్టారు.  నిర్మాణ వ్యయాన్ని  20.5 బిలియన్ దిర్హామ్‌లు (సుమారు ₹ 50,000 కోట్లు) గా అంచనా వేశారు.  ప్రారంభ దశలో  దీని వ్యయం 18 బిలియన్ దిర్హామ్‌లుగా ప్రకటించినప్పటికీ, పనుల విస్తృతిని బట్టి ఇది 20.5 బిలియన్లకు పెరిగింది.

దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA) నివేదికల ప్రకారం, 2026 చివరి నాటికి ఈ ప్రాజెక్ట్ పనులు 30% పూర్తి కావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. డిసెంబర్ 2025 నాటికి సుమారు 12% పనులు పూర్తయ్యాయి.  30 కిలోమీటర్లలో   14 కొత్త స్టేషన్లు నిర్మిస్తున్నారు.  ఈ బ్లూలైన్​   దుబాయ్ క్రీక్ హార్బర్, ఇంటర్నేషనల్ సిటీ, దుబాయ్ సిలికాన్ ఒయాసిస్  ,  అకడమిక్ సిటీని  కలుపుతుంది.

ఈ లైన్‌లో ప్రపంచంలోనే ఎత్తైన మెట్రో స్టేషన్ (దుబాయ్ క్రీక్ హార్బర్‌లో) నిర్మించనున్నారు. ఈ మెట్రో లైన్ సెప్టెంబర్ 9, 2029 నాటికి ప్రజలకు అందుబాటులోకి తీసుకు రావాలి. ఇదీ టార్గెట్​.

Sand Drought : ఇసుక కోసం షిప్​  పాట్లు

దుబాయ్ లో భవన  నిర్మాణ రంగానికి  ఏడాదికి 4-5 % వృద్ధి చెందుతోంది.  సాధారణ భవనాలకు  ప్రతి 1 చదరపు అడుగుల నిర్మాణానికి సుమారు 1.8 క్యూబిక్ అడుగుల (cft) ఇసుక అవసరం.  కృత్రిమ ద్వీపాలు లేదా భారీ మౌలిక సదుపాయాల కోసం ఇసుక వినియోగం ఇంకా ఎక్కువగా ఉంటుంది.

Sand Drought

ఉదాహరణకు, గతంలో నిర్మించిన ‘పామ్ జుమేరా’ ద్వీపం కోసమే సుమారు 18.6 కోట్ల క్యూబిక్ మీటర్ల సముద్రపు ఇసుకను వాడారు. దుబాయ్   2040 అర్బన్ మాస్టర్ ప్లాన్‌లో   నగరం పరిమాణాన్ని రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది, కాబట్టి రాబోయే పదేళ్లల్లో  ఇసుక వినియోగం భారీగా పెరిగే అవకాశం ఉంది.

Sand Drought : ఇసుకే మహా ప్రియం

దుబాయ్ చుట్టూ ఇసుక ఎడారి ఉన్నప్పటికీ, భవన నిర్మాణ రంగ అవసరాల కోసం ఇతర దేశాల నుంచి ఇసుకను దిగుమతి అనివార్యమైంది .  ఎడారి ఇసుక రేణువులు గాలి కోత (Wind erosion) తో  చాలా నునుపుగా, గుండ్రంగా ఉంటాయి. కాంక్రీటు తయారీలో సిమెంట్ పట్టుకోవడానికి గరుకైన, కోణాలు కలిగిన ఇసుక అవసరం. ఎడారి ఇసుకతో కట్టడాలు నిర్మిస్తే అవి దృఢంగా ఉండవు.

Sand Drought

భవన నిర్మాణాలకు నదులు లేదా సముద్ర గర్భం నుండి తీసే ఇసుక మాత్రమే పనికొస్తుంది. దుబాయ్‌లో నదులు లేకపోవడం, ఇప్పటికే ఉన్న సముద్రపు ఇసుక నిల్వలు (ఉదా: పామ్ జుమేరా వంటి కృత్రిమ ద్వీపాల కోసం) తరగిపోవటంతో ఇసుక కోసం పరాయి దేశాల వైపు దిక్కులు చూసే పరిస్థితి ఏర్పడింది.   చైనా,  వియత్నాం   దేశాల్లో  క్వాలిటీ  సిలికా ఇసుక (Silica Sand)   నదీ ఇసుక నిల్వలు పుష్కలంగా ఉన్నాయి.

దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా వంటి భారీ ప్రాజెక్టుల కోసం అవసరమైన గరుకు ఇసుకను ఆస్ట్రేలియా , చైనా, వియత్నాం   నుంచి  దిగుమతి చేస్తున్నారు.  దుబాయ్ ఏటా సుమారు $ 46.2 మిలియన్ల (దాదాపు ₹380 కోట్లు) విలువైన ఇసుకను ప్రధానంగా నిర్మాణాలు బీచ్‌ల పునరుద్ధరణ కోసం దిగుమతి చేసుకుంటోంది.

Sand Drought  : ఖరీదు  ధర తక్కువే..

దుబాయ్‌లో సాధారణ సిలికా ఇసుక   ధర టన్నుకు సుమారు 35 నుండి 75 అమెరికన్ డాలర్లు (సుమారు ₹2,900 – ₹6,300) మధ్య ఉంటుంది.  గ్లాస్ తయారీకి వాడే అత్యంత స్వచ్ఛమైన ఇసుక ధర ఇంకా ఎక్కువగా ఉంటుంది.

 సగటున టన్నుకు సుమారు 166 డాలర్ల (సుమారు ₹13,900) వరకు చెల్లించి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) ఇసుకను  దిగుమతి చేసుకుంటోంది. స్థానికంగా రిటైల్ మార్కెట్‌లో 3 టన్నుల బ్లాక్ వాష్డ్ ఇసుక ధర సుమారు 393.75 AED (సుమారు ₹9,000) గా ఉంది.

Sand Drought  : దారి ఖర్చే అదనం

Sand Drought

 చైనాలోని ప్రధాన ఓడరేవుల (షాంఘై, నింగ్బో) నుండి దుబాయ్‌లోని జెబిల్ అలీ పోర్ట్ వరకు 20 అడుగుల కంటైనర్ (FCL) ధర సుమారు $ 800 నుండి $1,300 వరకు ఉంటుంది. ఒక 20 అడుగుల కంటైనర్‌లో సుమారు 20- నుంచి 25 టన్నుల ఇసుకను రవాణా జరుగుతుంది.   సముద్ర రవాణా ఖర్చు   టన్నుకు సుమారు $40 నుండి $65 వరకు ఉంటుంది.

 వియత్నాం నుండి దుబాయ్ (Vietnam to Dubai)

 హో చి మిన్ సిటీ నుండి దుబాయ్‌కి సముద్ర మార్గంలో  సుమారు $770 నుండి $1,000 వరకు ఉంటుంది.  కంటైనర్ లోడ్ సామర్థ్యాన్ని బట్టి, వియత్నాం నుండి రవాణా ఖర్చు టన్నుకు సుమారు $ 35 నుండి $ 50 వరకు ఉంటుంది.  

ఆస్ట్రేలియా నుండి దుబాయ్ (Australia to Dubai)

 సిడ్నీ ,  మెల్బోర్న్ నుండి    కంటైనర్ రవాణా ఖర్చు సుమారు $1,500 నుండి ప్రారంభమవుతుంది.  దూరం ఎక్కువగా ఉండటం వల్ల ఇక్కడ ఖర్చు కొంత పెరుగుతుంది. ఇది టన్నుకు సుమారు $60 నుండి $80 వరకు ఉండవచ్చు.  బల్క్ షిప్పింగ్ (Bulk Shipping):    నిర్మాణం లేదా భూమి చదును కోసం బల్క్ క్యారియర్ ఓడల్లో  రవాణా చేస్తారు. సాధారణ  కంటైనర్ ధరల కంటే టన్నుకు అయ్యే ఖర్చు గణనీయంగా తగ్గుతుంది.  ఓడ రవాణా (Ocean Freight) ఛార్జీలు మాత్రమే. వీటికి అదనంగా కస్టమ్స్ డ్యూటీలు, లోడింగ్ -అన్‌లోడింగ్ ఛార్జీలు,   దుబాయ్‌లో పోర్ట్ నుండి గమ్యస్థానానికి చేరవేసే లోకల్ ట్రాన్స్‌పోర్ట్ ఖర్చులు అదనంగా ఉంటాయి.

Sand Drought : కార్మికులకూ  డిమాండు

Sand Drought

దుబాయ్ 2040 అర్బన్ మాస్టర్ ప్లాన్ పామ్ జెబెల్ అలీ భారీ ప్రాజెక్టుల వల్ల ప్రస్తుతం అక్కడ 5 లక్షల నుండి 8 లక్షల అదనపు కార్మికుల అవసరం ఉందని అంచనా. ముఖ్యంగా స్కిల్డ్ వర్కర్స్ (మేస్త్రీలు, ఎలక్ట్రీషియన్లు, క్రేన్ ఆపరేటర్లు) డిమాండ్ ఎక్కువగా ఉంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) లో మొత్తం 35 లక్షల మంది భారతీయులు ఉండగా, అందులో దుబాయ్‌లోనే సుమారు 15 లక్షల మంది వరకు ఉన్నారు. వీరిలో సుమారు 60% నుండి 70% మంది నిర్మాణ రంగంలోనే పని చేస్తున్నారు. దుబాయ్‌లోని భారతీయ కార్మికులలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల కార్మికులు గణనీయంగా ఉన్నారు.

సుమారు 3 నుండి 4 లక్షల మంది తెలుగు కార్మికులు దుబాయ్ నిర్మాణ రంగంలో ఉన్నారని అంచనా.  తెలంగాణలోని ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్ , ఏపీలోని కోస్తా జిల్లాల కార్మికులు అత్యధికంగా ఉన్నారు.   సాధారణ కూలీలు (Unskilled): 800 – 1,200 దిర్హామ్లు (సుమారు ₹18,000 – ₹27,000), స్కిల్​ వర్కర్లకు (Skilled – Mason/ Carpenter): 1,500 – 2,500 దిర్హామ్లు (సుమారు ₹34,000 – ₹56,000).ఫోర్​ మెన్/సూపర్‌ వైజర్లు: 3,500 – 6,000 దిర్హామ్లు (సుమారు ₹80,000 – ₹1,35,000) వేతనం లభిస్తోంది.

ALSO READ : TARGET  GERMANY :  ఇక టార్గెట్​ జర్మనీ AndhraPrabha Spl Story

click here for more

Leave a Reply