సాయి టవర్ అభివృద్ధికి కృషి…

సాయి టవర్ అభివృద్ధికి కృషి…

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : సాయి టవర్స్ అభివృద్ధికి కృషి చేస్తామని నూతన కార్యవర్గం తెలిపారు. శనివారం నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 3వ డివిజన్ లో గల సాయి టవర్ అపార్ట్మెంట్ కమిటీ ఎన్నిక నిర్వహించగా ఏకగ్రీవంగా నూతన కమిటీ ఎన్నికయ్యారు. సాయి టవర్స్ లో గల 5 బ్లాక్ ల అపార్ట్మెంట్ వాసులు నూతన కార్యవర్గాన్ని అభి నందించి సన్మానిం చారు.

సాయి టవర్ కమిటీ అధ్యక్షుడిగా బిర్లా లక్ష్మణ్ రావు ,(బి బ్లాక్ )ప్రధాన కార్య దర్శి గా ఎన్. రాజ శేఖర్, (ఈ బ్లాక్) కోశా ధికారిగా బాదాం రవికాంత్ (ఏ బ్లాక్),ఉపాధ్యక్షుడిగా హన్మండ్లు (డి బ్లాక్)సునీల్ , జాయింట్ సెక్రెటరీ (సి బ్లాక్)లు ఏకగ్రీవంగా ఎన్నిక య్యారు. ఈ సంద ర్భంగా నూతన కార్య వర్గం మాట్లాడుతూ అపార్ట్మెంట్ వాసులను అందరిని సమన్వయం చేసుకుంటూ అపా ర్ట్మెం ట్ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.

Leave a Reply