Sai Kiran| ఈతకు వెళ్లి విద్యార్థి గలంతు
Sai Kiran| మహబూబాబాద్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని అనంతారం శివారులో ఉన్న మైసమ్మ చెరువులో ఈతకు వెళ్ళిన పాలిటెక్నిక్ (Polytechnic) మొదటి సంవత్సరం చదువుతున్న భూక్యా సాయికిరణ్ (17) అనే విద్యార్థి గల్లంతయ్యాడు. కేసముద్రంలో పాలిటెక్నిక్ చదువుతున్న ఎనిమిది మంది విద్యార్ధులు శనివారం మహబూబాబాద్‌లోని వేంకటేశ్వరస్వామి ఆలయానికి వచ్చినట్లు తెలుస్తుంది. స్నానం చేసేందుకు పక్కనే ఉన్న మైసమ్మ చెరువులోకి ముగ్గురు విద్యార్ధులు దిగారు. అందులో సాయి కిరణ్ గల్లంతయ్యాడు. సాయికిరణ్ స్వస్థలం మహబూబాబాద్ మండలం, రెడ్యాల గ్రామం అని స్థానికులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా సాయికిరణ్ మృతదేహం కోసం ఎస్‌డీఆర్ఎఫ్, ఫైర్ , రూరల్ పోలీస్ సిబ్బంది చెరువులో గాలిస్తున్నారు.

