ఘనంగా సద్గురు పులాజీ బాబా ధ్యాన కేంద్ర వార్షికోత్సవం

సిర్పూర్ (యు), ఆంధ్రప్రభ : కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యు) మండలంలోని పంగిడి గ్రామంలోని శ్రీశ్రీ శ్రీ సద్గురు పులాజి బాబా ధ్యాన కేంద్ర 24వ వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో సద్గురు శ్రీ శ్రీ శ్రీ పులాజి బాబా తనయుడు పాట్నాపూర్ సిద్దేశ్వర సంస్థాన్ అధ్యక్షులు ఇంగ్లే కేశవ్ రావు దాదా,వెడ్మ జై వంతరావు మహారాజ్ పాల్గొని జెండాకు పూజలు చేసి జ్యోతి ప్రజ్వలన చేశారు.అనంతరం ధ్యాన కేంద్రంలో సద్గురు పూలజ బాబా చిత్రపటానికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక మార్గంలో నడవాలని వారు కోరారు.

ఈ సందర్భంగా సద్గురు పూలాజి బాబా తనయుడు కేశవ్ రావు మాట్లాడుతూ నేడు బాబా చూపిన మార్గంలో ఎన్నో కుటుంబాలు మంచి మార్గంలో నడుస్తున్నారని, ప్రతి ఒక్కరు ధ్యానం చేయాలని, బాబా చూపిన ఆధ్యాత్మిక ధ్యాన సన్మామార్గాలను రాబోయే మన ముందు తరానికి కూడ బాబా యొక్క మార్గంలో నడవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంస్థాన్ ఆద్యుక్షుడు టార్పె రఘునాథ్, కమిటీ సభ్యులు విశ్వంబర్, ఆత్రం భగవంత్ రావు,బొడికే శ్యాంరావు, బొథింగ్ శ్యాంరావు, జనార్దన్, గంగాధర్,దేశముకే మారుతి, దుక్రే సుభాష్,భక్తులు తదితరులు పాల్గొన్నారు.
