అక్టోబర్ 8 నుంచి సదరం శిబిరాలు

అక్టోబర్ 8 నుంచి సదరం శిబిరాలు

  • లబ్ధిదారుల హాజరు తప్పనిసరి
  • విజయనగరం జిల్లా కలెక్టర్ ఆదేశం

విజయనగరం, ఆంధ్ర ప్రభ : సదరం క్యాంపులకు లబ్ధిదారులు తప్పనిసరిగా హాజరు కావాలని విజయనగరం జిల్లా(Vizianagaram District) కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి చేశారు. బుధ వారం కలెక్టర్ సూపర్ జీఎస్టీ కాంపెయిన్(GST Campaign), ఈ క్రాప్ నమోదు, సదరం క్యాంపుల పై అధికారులతో టెలీ కాన్ఫెరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దివ్యాంగుల పెన్షన్ల పునర్ మూల్యాంకన లో, అర్హత తక్కువగా ఉన్నట్టు నిర్ధారించిన నేపథ్యంలో దివ్యాంగులు అప్పీలు చేసిన సందర్భాల్లో తిరిగి వైద్య పరీక్షలు నిర్వహించేందుకు సదరం శిబిరాలు అక్టోబర్ 8వ తేదీ నుంచి ప్రారం భమవు తున్నాయని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి(S. Ramsunder Reddy) తెలిపారు.

కలెక్టర్ పేర్కొన్నదానిలో – వైద్య ఆరోగ్య శాఖ ఈ శిబిరాల నిర్వహణకు షెడ్యూల్ ఖరారు చేసిందని, అప్పీల్ చేసిన దివ్యాంగుల వివరాలను ఆయా ఆసుపత్రులకు మ్యాపింగ్ చేసి, ఎంసీపీడీఓ (MPDO) లాగిన్లలో నోటీసులు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఎంసీపీడీఓలు తక్షణమే జీఎస్‌డబ్ల్యూఎస్ (GSWS) ద్వారా సంబంధిత లబ్ధిదారులకు నోటీసులు తప్పనిసరిగా అందజేయాలని ఆయన ఆదేశించారు. క్యాంపునకు లబ్ధిదారు హాజరు కాకపోతే వారికి పింఛన్ అందే పరిస్థితి ఉండదని తెలియజేయాలన్నారు. అదే విధంగా, ఆసుపత్రి సూపరింటెండెంట్లు శిబిరాల నిర్వహణకు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేయాలని, అక్టోబర్ 8వ తేదీ నాటికి వైద్య బోర్డు(Medical Board) సిద్ధంగా ఉండాలని కలెక్టర్ సూచించారు.

దివ్యాంగుల సౌకర్యార్థం ఆసుపత్రులలో తాగునీరు, కూర్చునే సదుపాయం వంటి మౌలిక వసతులు సమృద్ధిగా ఉండేలా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమం సున్నితమైన దని దృష్టిలో ఉంచుకుని, శిబిరాలు సాఫీగా, మానవీయంగా సాగేలా చూడాలి. ఏవైనా సందేహాలు ఉంటే వెంటనే జిల్లా స్థాయిలో సంప్రదించండి, అని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి పేర్కొన్నారు.

సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్.. ప్రచారం కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని, లక్ష్యాల మేరకు ఏ రోజు కార్యక్రమాలను ఆ రోజే పూర్తి చేయాలని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్.రాం సుందర్ రెడ్డి ఆదేశించారు. సచివాలయాలతో మాపింగ్, షెడ్యూల్ చేయడం, డాక్యుమెంటేషన్, 8 న కార్యక్రమాలను అప్లోడ్(Upload) చేయాలన్నారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఛాంపియన్స్ గా ఉన్న సచివాలయ సెక్రటరీ లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు(Municipal Commissioners) కార్యక్రమాలను డాక్యుమెంటేషన్ చేసి అప్లోడ్ చేయాలని సూచించారు.

సూపర్ జీఎస్టీ పై పరిశ్రమల శాఖ ద్వారా ఎం.ఎస్.ఎం.ఈ(MSME)లలో ఎగ్జి బిషన్లు నిర్వహించాలని తెలిపారు. అన్ని పాఠశాలల్లో, కళాశాలల్లో సూపర్ జీఎస్టీ పై అవగాహనా తరగతులను నిర్వహించి, విద్యార్థులకు పోటీలను కూడా నిర్వహించాలని తెలిపారు. పోటీల వివరాలను, విజేతలు వివరాలను కూడా అప్లోడ్ చేయాలని తెలిపారు. వైద్య శాఖ ద్వారా ప్రైవేటు ఆసుపత్రుల వద్ద, ఫార్మా కంపెనీ ల వద్ద సూపర్ జీఎస్టీ(Super GST) సూపర్ సేవింగ్స్ పై పోస్టర్లు, ఏర్పాటు చేయడం, వర్క్ షాప్ లు నిర్వహించాలన్నారు.

ఈ క్రాప్ నమోదు ఈ నెల 25 లోపల పూర్తి చేయాలని, అందుకోసం వ్యవసాయ అధికారులకు మండల రెవిన్యూ(Mandal Revenue) అధికారులు, సర్వేయర్లు సహకరించాలని తెలిపారు. వ్యవసాయేతర, ప్రభుత్వ భూములన్నింటిని నమోదు చేయవలసి ఉందని, ఈ విషయంలో రెవిన్యూ అధికారుల భాగస్వామ్యం ముఖ్యమైనదని అన్నారు.

Leave a Reply