rural development | ఒక అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తా

rural development | ఒక అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తా
rural development | భీమ్గల్ రూరల్, ఆంధ్రప్రభ : తొలిసారిగా ప్రజాసేవకు అంకితమవుదామనే ఉద్దేశ్యంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని ఎన్నికల్లో ఆశీర్వదించాలని బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మారుపెద్ది మీనా గణేష్ తెలిపారు. భీమ్గల్ మండలం పల్లికొండ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నానని ఆయన తెలిపారు.
వచ్చే ఎన్నికల్లో(election) ఫుట్ బాల్ గుర్తుకు ఓటేసి తనను గెలిపిస్తే ప్రజల సమస్యలు తీరుస్తానని హామీ ఇచ్చారు. తొలిసారిగా ఎన్నికల బరిలోకి నిలుస్తున్నానని, గ్రామస్తుల మద్దతు కూడగట్టుకోని, ప్రజల సహకారంతో నామినేషన్ వేసినట్లు ఆమె తెలిపారు. నామినేషన్ పరిశీలన, ఉపసంహరణ అనంతరం ప్రచారంలో అభ్యర్థి మారుపెద్ది మీనా గణేష్ కు అధికారులు ఫుట్ బాల్ గుర్తు కేటాయించారు.
ఈ గుర్తు పై పోటీ చేస్తున్న మీనా గణేష్ ప్రజలు తనను ఆదరిస్తే గ్రామంలో మంచినీటి సమస్య తీర్చడానికి కృషి చేస్తానని ‘ఆంధ్రప్రభ’తో మాట్లాడుతూ.. గ్రామంలో ప్రత్యేకంగా బోర్లు వేయించి కుళాయిల ద్వారా ఇంటింటికి నీటి సరఫరా(water supply) చేసేందుకు తప్పకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.అదేవిధంగా గ్రామానికి పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందించడానికి సైతం అంకితభావంతో కృషి చేస్తారని స్పష్టం చేశారు.
సర్పంచ్ గా అవకాశం కల్పిస్తే గ్రామ సమ గ్రాభివృద్ధికి(rural development) చేస్తానని ఈ సందర్భంగా మారుపెద్ది మీనా గణేష్ హామీ ఇస్తూ మీ అమూల్యమైన ఓటు మా గుర్తుకు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని వేడుకున్నారు.
