16DigitsUID| మ‌హిళ‌ల‌కు స్మార్ట్ కార్డులు

16DigitsUID| మ‌హిళ‌ల‌కు స్మార్ట్ కార్డులు

16DigitsUID |మహాలక్ష్మి పథకం – ఉచిత బస్సు ప్రయాణానికి స్మార్ట్ కార్డులు
ప్రతి లబ్ధిదారికి 16 అంకెల యూఐడీ నంబర్
జూన్ 2న కార్డుల జారీకి ప్రభుత్వం నిర్ణయం
తొలి విడతలో 5 లక్షల మందికి స్మార్ట్ కార్డులు
రాష్ట్రవ్యాప్తంగా 1.5 కోట్ల మందికి అమలు లక్ష్యం

16DigitsUID | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఎంతోమంది మహిళలు సద్వినియోగం చేసుకున్నారు. ఫ్రీగా బ‌స్సు ఎక్కాలంటే అర్హులైన మ‌హిళ‌లు ఇప్ప‌టివ‌ర‌కు ఆధార్ కార్డు చూపించేవారు. కానీ ఇప్ప‌టి నుంచి ఆ అవ‌స‌రం ఉండ‌దు. త్వ‌ర‌లో మహిళలకు స్మార్ట్​కార్డులు ఇవ్వాలని సర్కార్​ నిర్ణయించింది. దీనికి సంబంధించి ఇప్ప‌టికే ఆర్టీసీని ప్రభుత్వం ఆదేశించింది. త్వరలో స్మార్ట్​కార్డులను సిద్ధం చేయాలని , జూన్​ 2వ తేదీన వీటిని జారీ చేయాలని సూచించింది. తొలి దశ ప్రాజెక్టుగా దాదాపు 5 లక్షల మందికి స్మార్ట్​ కార్డులు ఇవ్వనున్నట్లు సమాచారం.

16DigitsUID
16DigitsUID

చిప్​తో కూడినటు వంటి ఈ స్మార్ట్​కార్డులను

చిప్​తో కూడినటు వంటి ఈ స్మార్ట్​కార్డులను అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ స్మార్ట్​కార్డు జారీలో ప్రతి ప్రయాణికురాలికి 16 అంకెల యూఐడీ నంబర్​ ఇస్తారు. ఆ కార్డు ముందు సైడ్​ ఎడమ వైపు లబ్ధిదారు పేరు, గ్రామం, మండలం, జిల్లా తదితర వివరాలు ఉంటాయి. కుడివైపు ఫొటో ఉంటుంది. వెనక భాగంలో ఉచిత బస్సు పథకానికి సంబంధించిన నియమ నిబంధనలు పొందుపరిచారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.5 కోట్ల మందికి ఈ స్మార్ట్​కార్డులు జారీ అవనున్నాయి. రెండు నెలల క్రితం తొలి దశలో 5 లక్షల స్మార్ట్​ కార్డులతో పైలట్​ ప్రాజెక్టు చేపడతామని ఆర్టీసీ తెలిపింది.

16DigitsUID
16DigitsUID
16DigitsUID
16DigitsUID

స్మార్ట్ కార్డుల ద్వారా ప్ర‌యోజ‌నం
ఈ స్మార్ట్​కార్డుల జారీతో అర్హత లేని ప్రయాణికుల దుర్వినియోగాన్ని అరికట్ట‌వ‌చ్చు. అలాగే రూట్​, దూర ప్రయాణాలకు, సమయాలపై కచ్చితమైన సమాచారం తెలుసుకోవ‌చ్చు. పేపర్​ లెస్​ టికెట్​ ప్రయాణం తోపాటు కండక్టర్లపై పనిభారం తగ్గుతుంది. రద్దీగా ఉన్న రూట్ల వివరాలు తెలుస్తాయి. బస్సులు పెంచడం, తగ్గించడం ఆర్టీసీకి తేలికవుతుంది. అలాగే ఈ ఉచిత బస్సు పథకాన్ని ఎంతమంది ఉపయోగించుకున్నారో తెలుస్తుంది.

Leave a Reply