RTC Logistics | టీజీఎస్ ఆర్టీసీ లాజిస్టిక్‌ సేవలు…

RTC Logistics | టీజీఎస్ ఆర్టీసీ లాజిస్టిక్‌ సేవలు…

RTC Logistics | కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ : కమ్మర్ పల్లి మండల కేంద్రంలోని బస్టాప్‌ సమీపంలో టీజీఎస్ ఆర్టీసీ లాజిస్టిక్‌ సేవలను బుధవారం ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ రీజినల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అధికారి కాశీరాం, నిజామాబాద్ డిపో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ సాయి కుమార్ లు హాజ‌రై ప్రారంభించారు.

కమ్మర్ పల్లి మండల పరిసర ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని,మీ పార్సల్ లను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఇతర రాష్ట్రాలకు బుకింగ్‌ చేసుకోని పంపించుకోవచ్చన్నారు. ప్రజల సౌకర్యార్థమే ఆర్టీసీ ఈ సేవలను ప్రారంభించిందన్నారు. ఈ కార్యక్రమలో పొందేటి క్రాంతి కుమార్, శివాజీ, ప్రవీణ్, జిషన్, సంతోష్, దీక్షిత్, కోరే నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply