RTC COLONY | రోడ్డు ప్రమాదంలో వైద్య విద్యార్థిని మృతి

RTC COLONY | రోడ్డు ప్రమాదంలో వైద్య విద్యార్థిని మృతి
RTC COLONY | హయత్ నగర్, ఆంధ్రప్రభ : రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎంబీబీఎస్ చివరి సంవత్సరం చదువుతున్న వైద్య విద్యార్థిని యంసాయని ఐశ్వర్య మృతిచెందగా, ఆమె తండ్రి పాండు తీవ్రంగా గాయపడ్డారు. ఇవాళ ఉదయం ఆర్టీసీ కాలనీ (Rtc Colony) వద్ద రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. యంసాయని ఐశ్వర్య మహబూబ్‌నగర్‌లోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ చివరి సంవత్సరం చదువుతున్నది. సోమవారం ఉదయం తన తండ్రి పాండుతో కలిసి హయత్‌నగర్ ఆర్టీసీ కాలనీ వద్ద రోడ్డు దాటుతుండగా.. వేగంగా వచ్చిన కారు వారిని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.
