సింగ్ నగర్లో ఆర్టీసీ కార్గో పార్శిల్ బుకింగ్ కౌంటర్..

సింగ్ నగర్లో ఆర్టీసీ కార్గో పార్శిల్ బుకింగ్ కౌంటర్..

పాయకాపురం, ఆంధ్రప్రభ : అజిత్ సింగ్ నగర్ సెంట్రల్ టీడీపీ కార్యాలయం ప్రక్కన ఆల్ఫా ఎంటర్ ప్రైజెస్ నందు ఏపీఎస్ ఆర్టీసీ పార్సెల్ మరియు కార్గో బుకింగ్ కౌంటర్ను సంస్థ ఈ డి. విజయ్ రత్నం బుధవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఈడీ విజయ్ రత్నం మాట్లాడుతూ ప్రజలను ప్రతిరోజూ గమ్యస్థానాలకు చేరవేయడంలో ఆర్టీసీ ప్రధమ స్థానంలో ఉందని అన్నారు. అలాగే సంస్థ అమ్ములపొదిలో నిక్షిప్తమైన కార్గో పార్శిల్ సేవలు చాలా ఉపయోగకరమైనదిగా ఉందని అన్నారు.

అందరికి అందుబాటులో ప్రభుత్వ రవాణా రంగ సంస్థ అయిన ఆర్టీసీ కార్గో, పార్శిల్ సేవలు అతి తక్కువ ఖర్చుతో,ప్రజలకు అనుకున్న సమయంలో నిర్దిష్టమైన సమయానికి, భద్రతతో అందిస్తుందని అన్నారు. ప్రతిఒక్కరు ఈసేవలు వినియోగించుకోవాలని మరొక ముఖ్య అతిధి సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తనయుడు సిద్దార్ధ అన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఎటిఎం మోషే,రబ్బుని పాల్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply