Rtc Bus Stand | ఇదీ మ‌క్త‌ల్ బ‌స్ స్టేష‌న్ దుస్థితి

Rtc Bus Stand | ఇదీ మ‌క్త‌ల్ బ‌స్ స్టేష‌న్ దుస్థితి

  • Rtc Bus Stand | కూర్చోడానికి బెంచీలు చాల‌వు.. తాగేందుకు నీళ్లు ఉండ‌వు!

Rtc Bus Stand | మక్తల్ , (నారాయ‌ణ‌పేట జిల్లా), ఆంధ్ర‌ప్ర‌భ : ప్ర‌యాణికులు కూర్చోడానికి బెంచీలు ఉండ‌వు.. తాగేందుకు నీళ్లు ఉండ‌వు… ఇదీ మ‌క్త‌ల్ బ‌స్ స్టేష‌న్ (Rtc Bus Stand ) దుస్థితి. 1983లో రెండు ఎకరాల విస్తీర్ణంలో ఆర్టీసీ బస్ స్టేషన్(RTC Bus Station) నిర్మించారు. అప్పట్లో ఇక్కడి బస్ స్టేషన్ లో ప్రయాణికులకు అవసరమైన అన్ని సదుపాయాలు క‌ల్పించారు.

రాను రాను ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యంతో ఇక్క‌డ బ‌స్ స్టేష‌న ప‌రిస్థితి మారిపోయింది. నీళ్లు తాగాలంటే 20 రూపాయలు పెట్టి బాటిల్ కొనాల్సిందే. లేదా పది రూపాయలు పెట్టి టీ తాగితే తప్ప మంచినీళ్లు దొరకని దుస్థితి ఇక్కడ ఉంది.

ఆర్టీసీ బస్ స్టేషన్ నుండి మక్తల్ మండలంలోని 39 గ్రామాలకు చెందిన ప్రయాణికులు నిత్యం రాక‌పోక‌లు చేస్తూ ఉంటారు. అయితే ఆయా గ్రామాలలో దాదాపు సగం గ్రామాలకు బస్సు సౌకర్యం కూడా కల్పించలేని దుస్థితిలో నారాయణపేట ఆర్టీసీ డిపో ఉంది. బస్సులు తిరిగే గ్రామాల నుండి సైతం ప్రతిరోజు దాదాపుగా రెండు వేల మంది ప్రయాణికులు ఈ బ‌స్ స్టేష‌న్ మీదుగా రాక‌పోక‌లు చేస్తూ ఉంటారు.

వివిధ పనుల నిమిత్తం ఆయా గ్రామాల నుండి మక్తల్(Maktal) వచ్చే ప్రయాణికులకు బస్టాండ్ లో కనీస వసతులు లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. ఇదే బస్టాండ్ నుండి రాష్ట్ర రాజధాని హైదరాబాద్(State Capital Hyderabad) తో పాటు కర్ణాటక లోని ప్రాంతాలకు ఆంధ్రప్రదేశ్‌లోని పుణ్యక్షేత్రమైన మంత్రాలయం, తిరుపతి అదేవిధంగా గోవా వంటి ప్రాంతాలకు నిత్యం ప్రయాణికులు తరలి వెళ్తుంటారు.

బస్టాండ్ ప్రాంగణంలో రెండు ష‌టర్లతోపాటు దాదాపు 50 డబ్బాలు(50 boxes) (దుకాణాలు) వివిధ వ్యాపారాలు కొనసాగుతున్నాయి. దీంతో కూర్చోవడానికి సరిపడా బెంచీలు లేవు. ప్రయాణికుల సంఖ్య పెరగడం రవాణా వ్యవస్థ పెరగడంతో వందలాది బస్సులు ప్రతినిత్యం రాక‌పోక‌లు చేస్తున్నాయి.

ఇక్కడ నుంచి హైద‌రాబాద్‌, యాదగిరిగుట్ట , గుంటూరు(Yadagirigutta, Guntur), విజయవాడ, మంత్రాలయం, గోవా , దావనగేరి , లింగసూగుర్, హోస్పేట్ త‌దిత‌ర సుదూర ప్రాంతాలకు గ్రామీణులు మక్తల్ బస్ స్టేషన్ నుంచే రాక‌పోక‌లు చేస్తుంటారు. తాగడానికి మంచినీళ్లు కల్పించలేని దుస్థితిలో ఆర్టీసీ అధికారులు ఉన్నారంటే వారి చిత్త‌శుద్ధి అర్థం చేసుకోవ‌చ్చు.

ఆదాయం కోసం విచ్చలవిడిగా డబ్బాల (దుకాణాల‌)కు అనుమతులు మాత్రం ఇస్తూ ఉంటారు. డబ్బాలు ఏర్పాటు చేసుకునే విషయంలో కూడా కనీస పద్ధతులు పాటించకుండా విచ్చలవిడిగా ఎక్కడపడితే అక్క‌డే ఆర్టీసీ అధికారులు అనుమతులు ఇస్తున్నారు.

ఆర్టీసీ బస్ స్టేషన్ సుందరీకరణలో భాగంగా ప‌ది లక్షలతో ప్రయాణికులు కూర్చోవడానికి తాత్కాలిక వసతులు, వెల్కమ్ బోర్డు మక్తల్ మున్సిపాలిటీ ఏర్పాటు చేసింది. ఇప్ప‌టికైనా ఆర్టీసీ అధికారులు స్పందించి బ‌స్ స్టేష‌న్‌లో ప్ర‌యాణికుల‌కు సౌక‌ర్యాలు క‌ల్పించాల‌ని ప‌లువురు కోరుతున్నారు.

Leave a Reply