ఆశా కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న పోలీసులు

ఆశా కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న పోలీసులు
బాసర నిర్మల్ జిల్లా, ఆంధ్రప్రభ : ఆశా కార్యకర్తలు సీఎం ముఖ్యమంత్రికి తమ సమస్యలు వివరిస్తామని వెళుతున్న తమను అకారణంగా అడ్డుకొని అరెస్టు చేశారని సిఐటియు జిల్లా కార్యదర్శి బొమ్మన సురేష్ అన్నారు. సోమవారం బాసర ఆర్టీసీ బస్టాండ్ నుండి వెళ్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రత్యేక భవనంలో మొదలు తరలించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శాంతియుతంగా సీఎం ను కలిసి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తున్న తమరు అకారణంగా అరెస్టు చేశారని సిఐటియూ జిల్లా అధ్యక్షులు గంగామణి ఆరోపించారు. కార్మికుల హక్కులను కాల రాస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
