విశాఖపట్నం : ఆర్టీసీ బస్సు దగ్ధమైన ఘటన విశాఖపట్నం (Visakhapatnam) ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. ఇవాళ ఉదయం కూర్మన్నపాలెం నుంచి విజయనగరానికి (Vizianagaram) వెళుతున్న ఆర్టీసీ బస్సు నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలను గుర్తించిన డ్రైవర్ (Driver) అప్రమత్తమై బస్సును నిలిపివేసి ప్రయాణికులను కిందకు దింపేశారు.
అందరూ చూస్తుండగానే బస్సు కాలిపోయింది. ఇంజిన్ నుంచి మంటలు (Engine fire) రావడంతోనే ప్రమాదం జరిగినట్లు డ్రైవర్ తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు (Police) ఘటనా స్థలికి చేరుకున్నారు. సంఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.