ట్రాక్టర్ ను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు

ట్రాక్టర్ ను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు
తిమ్మాపూర్, (ఆంధ్ర ప్రభ) కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణిగుంట శివారులో మంగళవారం వేకువ జామున రాజీవ్ రహదారి పై తీవ్ర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వడ్ల బస్తాల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ను హైదరాబాదు నుండి మెట్పల్లి వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో బస్సులో ఉన్న ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ట్రాక్టర్ ను ఢీకొట్టడంతో ట్రాక్టర్ లోడుతో సహా రోడ్డు కిందికి దూసుకెళ్లి బోల్తా పడింది. ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ ప్రాణాపాయం నుండి తప్పించుకున్నాడు.

తిమ్మాపూర్ మండలం నేదునూరు ధాన్యం కొనుగోలు కేంద్రం నుండి బస్తాలు లోడ్ చేసుకొని రైస్ మిల్లుకు తరలిస్తుండగా బస్సు ఢీ కొట్టింది. క్షతగాత్రులను ఎల్ఎండిఎస్ఐ శ్రీకాంత్ తన వెహికల్ లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని కరీంనగర్ రూరల్ ఏసిపి విజయ్ కుమార్, సీఐ సదన్ కుమార్ పరిశీలించారు. ఇటీవల తరచూ ఆర్టీసీ బస్సు ప్రమాదం జరుగుతున్న నేపథ్యంలో తిమ్మాపూర్ లో మరో ప్రమాదం జరగడం సంచలనం సృష్టించింది. ఘటనకు సంబంధించిన ప్రాథమిక దర్యాప్తు చేస్తున్నాట్లు ఎల్ఎండి పోలీసులు తెలిపారు.
