RTC | బస్సు బోల్తా..

RTC | బస్సు బోల్తా..
- పలువురికి గాయాలు
- డ్రైవర్ కి ఫిట్స్ రావడంతో ప్రమాదం
- అప్పన్నవలస కూడలి వద్ద ఘటన
RTC | విజయనగరం, ఆంధ్రప్రభ : జిల్లాలోని గరివిడి మండలం అప్పన్నవల్స కూడలిలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. రాజాం మీదుగా చీపురుపల్లికి వస్తున్న ఆర్టీసీ బస్సు గరివిడి మండలం అప్పన్నవలస కూడలికి వచ్చేసరికి డ్రైవర్‌కి ఫిట్స్ రావడంతో ఆర్టీసీ బస్సు రోడ్డు పక్కన వున్న పొలంలో బోల్తా పడింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న కొంతమంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి.
