రక్తదానంతో ప్రాణదాతలుగా నిలవండి…

రక్తదానంతో ప్రాణదాతలుగా నిలవండి…

డాక్ యార్డ్ మెగా రక్తదాన శిబిరానికి విశేష స్పందన
భారీగా రక్తదానం చేసిన* *ఉద్యోగులు *90 యూనిట్ల రక్తం సేకరణ

ఎన్ఏడి జంక్షన్, ఆంధ్ర‌ప్ర‌భ : దేశవ్యాప్తంగా రక్త నిల్వలు ఎంతో అవసరమని, కాబట్టి ప్రతి ఒక్కరూ సమాజ బాధ్యతగా భావించి రక్తదానం చేసి ప్రాణదాతలు గా నిలవాలని ప్రభుత్వ విప్..విశాఖ పశ్చిమ శాసనసభ్యులు గణబాబు పిలుపునిచ్చారు.. శనివారం ఎన్ఏడి జంక్షన్ కళాక్షేత్రంలో డాక్ యార్డ్ కేటిబీ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు.. తొలుత రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన గణబాబు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయని.. వాటిని తగ్గించడంతోపాటు ఎక్కడికక్కడ అవసరమైన మేరకు రక్త నిల్వలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు..

అలా చేయడం వల్ల ఎంతోమంది ప్రాణాలు కాపాడేందుకు అవకాశం కలుగుతుందన్నారు. అందువల్ల యువత ఎక్కువగా రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని గణబాబు కోరారు. మనం చేసే రక్తదానం ఎంతోమందికి ప్రాణం నిలబెడుతుందన్నారు. సామాజిక సేవలో డాక్ యార్డ్ కేటీబీ అసోసియేషన్ ముందు వరుసలో ఉందన్నారు.. రక్షణ రంగంలో విధులు నిర్వహిస్తూ వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు.

అసోసియేషన్ భవనాన్ని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారన్నారు.. అలాగే అధికారుల ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి. సంఘం అభివృద్ధికి తన వంతు సహకారం నిరంతరం ఉంటుందన్నారు. అన్ని కార్యక్రమాల్లో తనను భాగస్వామ్యం చేయడం ఎంతో సంతోషం కలిగిస్తుందన్నారు.. కార్యక్రమంలో గౌరవ అతిథులుగా హాజరైన గాజువాక బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బండి యశోదర వేదమణి ,ప్రముఖ గైనకాలజిస్ట్..లక్ష్మీ కొండమ్మ బొత్స లు మాట్లాడుతూ సమాజానికి ఎంతో ఉపయోగకరమైన ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో అభినందనీయమన్నారు .

ఇందుకు కృషి చేస్తున్న డాక్ యార్డ్ కేటీబీ అసోసియేషన్ సభ్యుల సేవలు ప్రశంసనీయమన్నారు.. మెగా రక్తదాన శిబిరంలో తమను కూడా భాగస్వాములు చేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు.. అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు అధ్యక్షులు బత్తుల చిరంజీవి లు మాట్లాడుతూ అందరి సహకారంతోనే అసోసియేషన్ ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు ఇప్పటికే విద్య ప్రోత్సాహకాలు.. వైద్య .. రక్తదాన శిబిరాలు.. వన సమారాధన.. ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.

విశాఖ బ్లడ్ డోనర్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరంలో సుమారు 90 యూనిట్ల రక్తం సేకరించారు.. ఈ కార్యక్రమంలో క్లబ్ నిర్వాహకురాలు ఎస్. రాజకుమారి…. అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటేష్.. కోశాధికారి గండ్రెడ్డి శ్రీనివాసరావు.. అదనపు కార్యదర్శి రాజకుమార్ సభ్యులు రమణ ..సన్యాసిరావు కాలనీ ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావు తదితరులతో పాటు పెద్ద ఎత్తున సభ్యులంతా పాల్గొన్నారు..

Leave a Reply