రూ. 75 వేల విరాళాలు అందజేత
కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ : విధి నిర్వహణలో ఉంటూ అకాల మరణం చెందిన సెర్ప్- ఐకెపీ(SERP- IKP) సిబ్బంది కుటుంబీకులకు కారుణ్య నియామకాలతోనే భరోసా లభిస్తుందని నిజామాబాద్ జిల్లా(Nizamabad District) టీఎన్జీవోస్ అధ్యక్షుడు జిల్లా ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ నాశెట్టి సుమన్(Nasetti Suman) పేర్కొన్నారు. ఈ రోజు కమ్మర్ పల్లి మండల కేంద్రంలో ఇటీవల అకాల మరణం చెందిన ఐకెపీ సీసీ రాజేశ్వర్ కుటుంబాన్ని పరామర్శించి, జిల్లా ఐకెపి సిబ్బంది విరాళాల ద్వారా జమచేసిన రూ. 75 వెలు టీఎన్జీవో కార్యదర్శి శేఖర్, ఐకెపి యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కుంట గంగాధర్, జిల్లా జేఏసీ చైర్మన్ బత్తుల మాణిక్యం(Bathula Manikyam), రవి, విఠల్ లతో కలిసి మృతుడి భార్యకు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమం విషయంలో సానుకూలంగా వ్యవహరిస్తుందని, ఐకెపి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఇదివరకే ఇచ్చిన వినతి మేరకు కారుణ్య నియామకాల కోసం ఫైలు ఆర్థిక శాఖకు చేరిందని కచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కారుణ్య నియామకం కింద మృతుడు రాజేశ్వర్ కుటుంబీకులకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉందని భరోసా ఇచ్చారు. విధి నిర్వహణలో పేద మహిళల సంక్షేమం కోసం 25 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఐకెపి సిబ్బంది సేవలను గుర్తించి కారుణ్య నియామకాలను వెంటనే అమలు చేయాలని ఈ సందర్భంగా నాశెట్టి సుమన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఐకెపి ఉద్యోగుల సంఘం జిల్లా జేఏసీ చైర్మన్ బత్తుల మాణిక్యం, ఐకెపి యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కుంట గంగాధర్(Kunta Gangadhar)లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున లభించే ఇన్సూరెన్స్, పిఎఫ్ వంటి సౌకర్యాలతో పాటు స్థానికంగా సిబ్బంది ఆనవాయితీ ప్రకారం మరణించిన కుటుంబీకులకు విరాళాలు అందజేయడం జరుగుతుందని, ఆవిధంగా పోగు చేసిన రూ. 75 వేలను తాత్కాలిక ఉపశమనం కొరకు ఈరోజు అందజేయడం జరిగిందని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో టీఎన్జీవోస్ జిల్లాకార్యదర్శి నేతి కుంట శేఖర్, రాష్ట్ర కమిటీ కార్యదర్శి శ్రీనివాస్, సలహాదారు ప్రభాకర్, భీమ్గల్ తాలూకా టీఎన్జీవోస్ ప్రెసిడెంట్ సృజన్ కుమార్(TNGOs President Srujan Kumar), ఆర్మూర్ తాలూకా ప్రెసిడెంట్ శశికాంత్ రెడ్డి, జిల్లా ఐకెపి జేఏసీ అధ్యక్షుడు భత్తుల మాణిక్యం, ఐకెపి యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కుంట గంగాధర్, సీసీ యూనియన్ జిల్లా అధ్యక్షుడు రవి, ఎంఎస్ సీసీ యూనియన్ జిల్లా అధ్యక్షుడు విఠల్, ఏపీఎం యూనియన్ ప్రధాన కార్యదర్శి ముఖిమ్, సీసీ యూనియన్ ప్రధాన కార్యదర్శి తడకల శ్రీనివాస్, ఎం ఎస్ సీసీ యూనియన్ జిల్లా కార్యదర్శి నవీన్, సీసీ లు గాజుల శీను, మహేందర్, సంతోష్, మురళి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.