Rs 72 lakhs | నకిలీ కంపెనీ మోసం

Rs 72 lakhs | నకిలీ కంపెనీ మోసం
Rs 72 lakhs | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : విజయవాడలో సాధారణ సెలూన్ నిర్వాహకుడికి భారీ జీఎస్టీ బకాయిల నోటీసులు రావడం సంచలనంగా మారింది. తనకు తెలియకుండానే రూ.72 లక్షల బకాయిలు పేరుకుపోవడంతో బాధితుడు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాడు.
విజయవాడకు చెందిన పైడాడ శ్రీనివాసరావు అనే సెలూన్ నిర్వాహకుడికి జీఎస్టీ అధికారులు రూ.72 లక్షల బకాయిలు చెల్లించాలని నోటీసులు జారీ చేశారు. ఈ పరిణామంతో అతను షాక్‌కు గురయ్యాడు.
ప్రాథమిక సమాచారం ప్రకారం, విశాఖపట్నంలో స్క్రాప్ ఐరన్ వ్యాపారం పేరుతో అతని ఆధార్, పాన్ కార్డులను ఉపయోగించి గుర్తుతెలియని వ్యక్తులు నకిలీ కంపెనీని సృష్టించి మోసానికి పాల్పడ్డారని అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారుల చర్యలతో అతని బ్యాంక్ ఖాతాను కూడా నిలిపివేశారు.
తనకు ఈ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేదని చెప్పుకుంటున్న శ్రీనివాసరావు, తన అమాయకత్వాన్ని నిరూపించుకోవడానికి అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. డిజిటల్ యుగంలో వ్యక్తిగత పత్రాల దుర్వినియోగం ఎంతటి సమస్యలకు దారితీస్తుందో ఈ ఘటన మరోసారి స్పష్టంచేస్తోంది. అధికారులు కేసును పరిశీలిస్తూ పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.
