రూ.5వేల లంచంతో..!

ఆంధ్రప్రభ బ్యూరో ఉమ్మడి ఆదిలాబాద్ : అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా పేరున్న ఆదిలాబాద్ సబ్ రిజిస్టార్ ఆఫీసు (Adilabad Sub Registrar Office) లో రూ. 5వేలకు కక్కుర్తి పడి జాయింట్ సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస్ రెడ్డి (Srinivas Reddy) ఏసీబీకి పట్టుబడ్డారు. బేల మండలం సిరిసన్న గ్రామానికి చెందిన ఓ వ్యక్తి గిఫ్ట్ డిడ్ రిజిస్ట్రేషన్ కోసం ఏజెంట్ ద్వారా సబ్ రిజిస్టర్ ఆఫీసుకు వెళ్ళాడు. ప్రతి పనికి ఓ లెక్కుంటుందని, గిఫ్ట్ డిడ్ కావాలంటే రూ.5 వేలు చేతులు తడపాల్సిందేనని జాయింట్ సబ్ రిజిస్టార్ శ్రీనివాస్ రెడ్డి బాధితునికి తెగేసి చెప్పాడు.
బాధితుడు చేసేదేం లేక ఏసీబీ అధికారుల (ACB arrests officer) ను ఆశ్రయించాడు. శుక్రవారం ఆఫీసులోనే మధ్యవర్తి ద్వారా రూ.5వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇన్చార్జి బాధ్యతలతో ఉన్న శ్రీనివాస్ రెడ్డి గతంలో ఒకసారి కరీంనగర్ జిల్లా మంథని సబ్ రిజిస్టార్ ఆఫీసులో లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడి బయటకు వచ్చారు.
