Rs. 50 crore | సాక్ష్యాలుంటే ప్రజల ముందుకు రండి..

Rs. 50 crore | సాక్ష్యాలుంటే ప్రజల ముందుకు రండి..

  • మేం మాటల్లో కాదు.. జీఓలతో సమాధానం ఇచ్చాం
  • బీఆర్ఎస్ హయాంలో ఘన్‌పూర్ హాస్పిటల్ పేపర్‌కే పరిమితమైంది
  • ఘన్‌పూర్ అభివృద్ధిని అడ్డుకున్నది బీఆర్‌ఎస్‌నే
  • బీఆర్‌ఎస్ అబద్ధాలను ప్రజలు నమ్మరు
  • బీఆర్‌ఎస్‌కు స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సవాల్

Rs. 50 crore | స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్ర‌ప్ర‌భ : స్టేషన్ ఘన్ పూర్ పట్టణ కేంద్రంలోని రైతు వేదికలో ఇవాళ‌ నిర్వహించిన కల్యాణ లక్ష్మి, ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొన్న జనగామలో నిర్వహించిన బీఆర్‌ఎస్ సమావేశంలో ఘన్‌పూర్ అభివృద్ధి(Development) అంశాలపై కొందరు నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన తీవ్రంగా మండిపడ్డారు.

ఘన్‌పూర్‌లో హాస్పిటల్‌ను తామే తీసుకొచ్చామని బీఆర్‌ఎస్ నేతలు చెప్పడం పూర్తిగా అవాస్తవమని ఆయన స్పష్టం చేశారు. ఘన్‌ పూర్ హాస్పిటల్‌కు సంబంధించిన మంజూరు జనవరి 2024లోనే జరిగిందని, ఎమ్మెల్యే ఎన్నిక అనంతరం హాస్పిటల్ నిర్మాణానికి ఆర్టీసీ గ్రౌండ్‌కు స్థల మార్పిడి చేసి ప్రస్తుతం పనులు కూడా కొనసాగుతున్నా యని తెలిపారు.

కేవలం పేపర్ పై హాస్పిటల్ పరిమితమైంది…

Rs. 50 crore |

బీఆర్‌ఎస్ హయాంలో ఘన్‌పూర్‌ లో కేవలం పేపర్‌పై మాత్రమే హాస్పిటల్ పరిమితమైందని, ప్రజలకు ఉపయోగపడే స్థాయిలో ఒక్క పని కూడా జరగలేదని కడియం శ్రీహరి విమర్శించారు. అదేవిధంగా బీఆర్‌ఎస్ ప్రభుత్వ కాలంలో ఘన్‌పూర్ మున్సిపాలిటీ మంజూరుకు తానే అడ్డుపడ్డానని జరుగుతున్న ప్రచారం పూర్తిగా అసత్యమని పేర్కొన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఘన్‌పూర్ మున్సిపాలిటీలో రూ.50కోట్ల(Rs. 50 crore) అభివృద్ధి పనులు మంజూరయ్యాయని, ఇప్పటికే టెండర్లు పూర్తయ్యాయి. రెండు మూడు రోజుల్లో పనులు ప్రారంభమవుతాయని వెల్లడించారు.

ఘన్‌పూర్‌కు మంచి పేరును తిరిగి తీసుకురావడమే నా లక్ష్యం…

తన లక్ష్యం వ్యక్తులపై విమర్శలు చేయడం కాదని, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి కోల్పోయిన ప్రగతిని, ఘన్‌పూర్‌కు మంచి పేరును తిరిగి తీసుకురావడమేనని కడియం స్పష్టం చేశారు. మాటలకంటే ఆధారాలే ముఖ్యమని, తాను ప్రభుత్వ ఉత్తర్వులు ప్రజల ముందే ఉంచానని తెలిపారు.

బీఆర్‌ఎస్ నేతల వద్ద నిజమైన సాక్ష్యాలు ఉంటే ప్రజల ముందు పెట్టాలని ఆయన సవాల్ విసిరారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రజలకు సంక్షేమ పథకాలు(welfare schemes) సమర్థవంతంగా అందిస్తోందన్నారు.

Leave a Reply