Rs. 50 crore | అభివృద్ధిలో ముందువరుసలో నిలపడం లక్ష్యం

Rs. 50 crore | అభివృద్ధిలో ముందువరుసలో నిలపడం లక్ష్యం
- రూ.25 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
- మొదటి విడతలో రూ.7 కోట్లు…రెండో విడతలో రూ.18 కోట్లు ప్రారంభించుకున్నాం.
- నెల రోజుల్లో పనులు పూర్తి చేయాలని ఆదేశాలు
- మున్సిపల్ కార్యాలయం, టౌన్ హాల్, మార్కెట్‌కు మరో రూ.25 కోట్లు -మరో 50 కోట్ల నిధుల కోసం సీఎంకు విజ్ఞప్తి చేస్తాను
- అభివృద్ధికి ప్రజలందరూ అండగా నిలవాలి
- ఉమ్మడి వరంగల్ జిల్లాలో స్టేషన్ ఘన్‌పూర్‌కు ప్రత్యేక గుర్తింపు
- స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి
Rs. 50 crore | స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్ ఘన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలో రూ. 50 కోట్ల(Rs. 50 crore) విలు వైన అభివృద్ధి పనులను పూర్తి చేయడమే కాకుండా మరొక యాభై కోట్ల రూపాయల నిధులను ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేసి ఎంపి, తాను అందరం కలిసి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని స్టేషన్ ఘన్ పూర్ మున్సిపాలిటీని అభివృద్ధిలో అగ్రభాగాన నిలిపే విధంగా కృషి చేస్తానని స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు.
ఈ రోజు స్టేషన్ ఘన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలోని చాగల్ లోని 6,7,8,9 వార్డులలో రూ.4కోట్లతో సిసి రోడ్లు, డ్రైనేజిల నిర్మాణానికి, స్టేషన్ ఘన్ పూర్ లో రూ.3కోట్లతో సిసి రోడ్లు, డ్రైనేజిలు, గాంధీ విగ్రహం నుండి బస్టాండ్, రైల్వే స్టేషన్(railway station) వర కు డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ నిర్మాణానికి, శివునిపల్లిలోని 2,3,4,5 వార్డులలో రూ.4కోట్లతో సిసి రోడ్లు, డ్రైనేజిల నిర్మాణానికి అలాగే మున్సిపాలిటీ పరిధిలో రూ.7 కోట్లతో వరద కాలువల నిర్మాణానికి మొత్తం రూ.18కోట్ల అభివృద్ధి పనులకు వరంగల్ పార్లమెంట్ సభ్యు రాలు డాక్టర్ కడియం కావ్య, మాజీ ఉప ముఖ్య మంత్రి, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ శంకుస్థాపన చేశారు.

వేగంగా సాగుతున్న అభివృద్ధి పనులు…
ఘన్‌పూర్ మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు వేగంగా సాగుతు న్నాయని ఎమ్మెల్యే కడియం పేర్కొన్నారు. మొదటి విడతలో 7 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ఇప్పటికే శంకుస్థాపన చేసుకున్నాం.. మరో 18కోట్ల రూపాయల పనుల కు శంకు స్థాపన చేసి మొత్తం 25కోట్ల రూపాయల విలువైన పనులను ప్రారంభించినట్లు వెల్లడించారు.

ఈ పనులన్నింటిని నెల రోజులలో పూర్తిచేసేలా అధికారులు, కాంట్రాక్టర్లు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అదేవిధంగా మరో 25 కోట్ల రూపాయలతో మున్సిపల్ కార్యాలయ భవనం, టౌన్ హాల్, ఇంటి గ్రేటెడ్ మార్కెట్ వంటి కీలక అభి వృద్ధి పనులను కూడా త్వరలోనే ప్రారంభించనున్నట్లు తెలిపారు. స్టేషన్ ఘన్ పూర్(Station Ghanpur) ప్రజలు అభివృద్ధిని చూసి అండగా నిలవాలని కోరారు. అభివృద్ధి చేసే పార్టీకి మద్దతుగా నిలిస్తే మరింత అభివృద్ధి చేసుకోవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ చైర్మన్ రాంబాబు, మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్య శిరీష్ రెడ్డి, చిలుపూర్ గుట్ట దేవస్థాన చైర్మన్ శ్రీధర్ రావు, మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ, కాంగ్రెస్ నాయకులు బెలిదే వెంకన్న, బూర్ల శంకర్, పోగుల సారంగపాణి, కనకం రమేష్, కొలిపాక సతీష్, గడ్డమీది సురేష్, గోనెల ఉపేందర్, ఇల్లందుల రాజనారాయణ, గట్టు రమేష్, సౌదరపల్లి సంప త్ రాజు, భాస్కుల సమ్మయ్య, మున్సిపల్ అధికారులు, స్థానిక నాయ కులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
