Rs.50 cr | తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం..

Rs.50 cr | తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం..

ఎంపీ కేశినేని శివనాథ్ చొరవతో ఏ.కొండూరు మండలానికి కృష్ణాజలాలు..

Rs.50 cr | విజయవాడ, ఆంధ్రప్రభ : తిరువూరు నియోజకవర్గంలోని ఏ.కొండూరు మండల ప్రజలకు దశాబ్దాలుగా వెంటాడుతున్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది. ఎంపీ కేశినేని శివనాథ్ కృషితో జల్ జీవన్ మిషన్ కింద నిర్మిస్తున్న కృష్ణాజలాల ప్రాజెక్ట్ తుది దశకు చేరుకుంది. కిడ్నీ బాధితులకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో సుమారు రూ.50 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్ ద్వారా మండలంలోని 38 గ్రామాలకు ఇంటింటా పైపు కనెక్షన్లు అందించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

ప్రాజెక్ట్ పనులను ఎంపీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సీపీడబ్ల్యూఎస్ విస్తరణను వేగవంతం చేశారు. మండలంలోని 56,481 జనాభాకు ఉపయోగపడే విధంగా 43 పాత ఓహెచ్ఎస్‌ఆర్ ట్యాంకులను మరమ్మతులు చేయడంతో పాటు 12 కొత్త ట్యాంకులు నిర్మించారు. ఇబ్రహీంపట్నం వి.టి.పి.ఎస్ కెనాల్ నుంచి శుద్ధి చేసిన నీటిని కుదప వరకు పంపించి, అక్కడి నుంచి విస్సన్నపేట, గంపలగూడెం మార్గంగా ఏ.కొండూరు మండలంలోని అన్ని గ్రామాలకు సరఫరా చేసేలా పైప్‌లైన్ వ్యవస్థ ఏర్పాటు చేశారు.

Rs.50 cr |

2023లో మంజూరైన ఈ ప్రాజెక్ట్ గతంలో నిర్లక్ష్యానికి గురైనప్పటికీ, ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంపీ కేశినేని శివనాథ్ ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతో తరచూ సమావేశాలు నిర్వహిస్తూ పనులను వేగవంతం చేశారు. ట్రయల్ రన్‌కు ముందు జనవరి 10న కోడూరు, పెద్దతండా గ్రామాల్లో స్వయంగా పర్యటించి ట్యాంకుల నిర్మాణం, పైప్‌లైన్ పనుల నాణ్యతను పరిశీలించారు.

మార్చి నెలలోనే ప్రాజెక్ట్ ప్రారంభానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లేదా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరయ్యే అవకాశం ఉంది. తాత్కాలికంగా ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా సీకేడీ ప్రభావం అధికంగా ఉన్న 21 గ్రామాలకు కుదప సుంప్ నుంచి రోజూ 4000 లీటర్ల సామర్థ్యంతో ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేసే ఏర్పాట్లు చేశారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చే వరకు ఈ విధానం కొనసాగనుంది.

Rs.50 cr | 38 గ్రామాలకు లబ్ధి..

కుమ్మరికుంట్ల, పాత రేపూడి, కొత్త రేపూడి, ఈస్ట్-వెస్ట్ మాధవరం, మెట్ట తండా, రేపూడి తండా, కృష్ణారావుపాలెం, మాన్సింగ్ తండా, కేస్య తండా, పెద్ద తండా, చైతన్య నగర్, చీమలపాడు, వెంకట తండా, లక్ష్మీపురం, దీప్లా నగర్, కరుణాపురం, కొండూరు తండా, ఏ.కొండూరు, పాత కొండూరు, అట్లప్రగడ, గొల్లమందల, గొల్లమందల తండా, రామచంద్రాపురం, కంభంపాడు, కోడూరు, మారేపల్లి, గునిచింతలపాడు, పోలిసెట్టిపాడు, కోమటికుంట, గోపాలపురం, వల్లంపట్ల, కొత్తూరు, హరిజనవాడ, వడ్డెర బజార్, జీల్లకుంట, రెడ్డి బజార్, జానలగడ్డ గ్రామాలు ఈ ప్రాజెక్ట్ ద్వారా లబ్ధి పొందనున్నాయి.

ఇంటింటికి కనెక్షన్ ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులోకి రానుండటంతో ఏ.కొండూరు మండల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న సమస్యకు పరిష్కారం చూపినందుకు ఎంపీ కేశినేని శివనాథ్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

Leave a Reply