Rs.5 lakhs | రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం

Rs.5 lakhs | రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం

Rs.5 lakhs | నిజామాబాద్, ఆంధ్రప్రభ : ఎన్నికల్లో హామీ ఇచ్చిన మహిళలకు రూ.2500, పెన్షన్ రూ. 4 వేల పెంపు, కల్యాణ లక్ష్మీలో తులం బంగారం హామీలో ఏ ఒక్కటి నెరవేర్చకుండా సర్పంచ్ ఎన్నికల్లో ఓట్ల కోసం చిన్న పిల్లలకు చాక్లెట్స్ ఇచ్చి బుజ్జగించినట్టు చీరెలు, వడ్డీ లేని రుణాలు ఇస్తున్న రేవంత్ రెడ్డి డ్రామా లాడుతున్నారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి(MLA Vemula Prashant Reddy) విమర్శించారు.

నిజామాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెరెండు మూడు రోజులుగా గ్రామాల్లో మహిళలకు ఇందిరమ్మ చీరలు పంచె కార్యక్రమం పెట్టుకున్నాడు. రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఓట్లు ఉన్నగ్రామల్లోని మహిళలకు మాత్రమే చీరలు పంచుతున్నాడు. ఓట్లులేని భీంగల్ లాంటి మున్సిపాలిటీల్లో మహిళలకు చీరలు పంచడం లేదని చెప్పారు. రేవంత్ రెడ్డి సర్పంచ్ ఎన్నికల కోసం మాత్రమే చీరలు పంచి వాటి ద్వారా ఓట్లు రాబట్టు కోవాలని చూస్తున్నాడనీ గ్రహించాలని కోరారు.

వడ్డీలేని రుణాలు(Interest Free Loans) అని అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. రూ.5 లక్షల లోపు రుణాలకు మాత్రమే వడ్డీ లేదు. రూ.5లక్షల(Rs.5 lakhs) కంటే ఎక్కువ రుణాలు తీసుకున్న మహిళ సంఘాలకు వడ్డీ వసూలు చేస్తున్నారని వివరించారు. రేవంత్ రెడ్డి డ్రామాలు అన్ని గుర్తించిన ఓటర్లు రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని ప్రశాంత్ రెడ్డి హెచ్చరించారు.

Leave a Reply