Rs. 34.75Lakhs | ఇందిరమ్మ గ్రామసభల నిధులు పక్కదారి: నల్లగొండ జిల్లాలో ఆరోపణలు

Rs. 34.75Lakhs | ఇందిరమ్మ గ్రామసభల నిధులు పక్కదారి: నల్లగొండ జిల్లాలో ఆరోపణలుగ్రామసభల కోసం రూ.34.75 లక్షల నిధుల విడుదల
పంచాయతీ కార్యదర్శులకు డబ్బులు ఇవ్వని ఎంపీడీవోలు?
తప్పుడు ఓచర్లు, బిల్లులతో నిధుల దుర్వినియోగం
కలెక్టర్ విచారణ జరిపితే అక్రమాలు వెలుగులోకి?
నిధుల విడుదలపై హౌసింగ్ పీడీ వివరణ
Rs. 34.75Lakhs | ఉమ్మడి నల్లగొండ బ్యూరో, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం నిర్వహించిన గ్రామసభల కోసం ప్రభుత్వం విడుదల చేసిన (Indiramma Gram Sabha funds) లక్షల రూపాయల నిధులు దుర్వినియోగమైనట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం జిల్లాలోని 31 మండలాలకు ఒక్కో మండలానికి లక్ష రూపాయల చొప్పున 31 లక్షలు, గట్టుప్పల్, గుడిపల్లి మండలాలకు 50వేల రూపాయలు చొప్పున లక్ష రూపాయలు, నల్లగొండ మున్సిపల్ కమిషనర్ పేరుపై లక్ష రూపాయలు, దేవరకొండ, హాలియా, చండూరు మున్సిపల్ కమిషనర్ల పేరుపై ఒక్కొక్క రికీ రూ. 50 వేల చొప్పున, ప్రాజెక్టు డైరెక్టర్ పై రూ. 25 వేల చొప్పున ప్రభుత్వం మొత్తం 34.75 లక్షల నిధులను గత సంవత్సరం అక్టోబర్ నెలలో అప్పటి జిల్లా కలెక్టర్ విడుదల చేసింది.

క్షేత్రస్థాయిలో పంచాయతీ కార్యదర్శులు గ్రామ సభలను నిర్వహించి టెంటు, కుర్చీలు, స్టేషనరీ, ఫ్లెక్సీలు, వాహనాల ఏర్పాటు, జిరాక్స్ తదితర ఖర్చులను పెట్టారు. ప్రభుత్వం నుండి వచ్చిన లక్ష రూపాయల నిధులను జిల్లాలోని చాలామంది ఎంపీడీవోలు క్షేత్రస్థాయిలో ఖర్చు చేసిన పంచాయతీ కార్యదర్శులకు ఇవ్వకుండా తప్పుడు ఓచర్లను తయారుచేసి బిల్లులను పక్కదారి పట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. డబ్బులు ఖర్చు చేసిన వివరాలను తెలిపే విధంగా యుటిలైజేషన్ సర్టిఫికెట్లను తయారుచేసి అధికారులకు అందజేయాలి. 5 వేలకు మించకుండా ఓచర్ కానీ లేదా రిసిప్టులను జతచేసి కవరింగ్ లెటర్ తో డబ్బులు ఖర్చు పెట్టిన నివేదికలను ప్రభుత్వానికి అందజేయాలి. కానీ జిల్లాలోని చాలా మండలాలకు చెందిన ఎంపీడీవోలు, కమిషనర్లు నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించి (MPDO corruption allegations
) వచ్చిన నిధులను పెద్ద ఎత్తున దుర్వినియోగం చేసినట్లు ఆయా శాఖల్లోని కిందిస్థాయి సిబ్బంది ఆరోపిస్తున్నారు.
కొన్ని మండలాలలో ఎంపీడీవోలు పంచాయతీ కార్యదర్శులతో ఖర్చు పెట్టించి వచ్చిన డబ్బుల నుండి వారికి రూపాయి కూడా చెల్లించకుండా స్వాహా చేసినట్లు ఆరోపణలు వినిపిస్తుండగా మరికొన్ని మండలాలలో ఎంపీడీవోలు కాంట్రాక్టర్లతో ఒప్పందం కుదుర్చుకొని తప్పుడు బిల్లులతో నిధులను పక్కదారి పట్టించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయాలపై జిల్లా కలెక్టర్ సమగ్ర విచారణ జరిపిస్తే అక్రమాలు బహిర్గతమయ్యే అవకాశం ఉందని పలువురు పంచాయతీ కార్యదర్శులు చెబుతున్నారు.
Rs. 34.75Lakhs | మూడు నెలల కిందటే నిధులను విడుదల చేశాం : హౌసింగ్ పీడీ రాజ్ కుమార్.
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం నిర్వహించిన గ్రామసభలను నిర్వహించినందుకు గాను మూడు నెలల కిందటే ఎంపీడీవోలకు, మున్సిపల్ కమిషనర్ కు కలిపి రూ.34.75 లక్షల నిధులను విడుదల చేశామని హౌసింగ్ పీడీ రాజ్ కుమార్ చెప్పారు. నిధుల పర్యవేక్షణ అధికారం ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లది అని చెప్పారు. వారిచ్చిన రసీదులు, ఓచర్ల ప్రకారం డబ్బులు అందించామని ఆయన చెప్పారు. ఎంపీడీవోలపై వస్తున్న ఆరోపణలపై తాము ఏమీ చేయలేమని ఆయన చెప్పారు.
click here to read TG | సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ
Indiramma housing scheme
Nalgonda district news
Gram sabha fund misuse
Panchayat secretary issue
Indiramma funds scam
Telangana rural development
Housing scheme irregularities
Andhra Prabha Nalgonda news
