రూ.3.5 కోట్లు సమర్పయామి

రూ.3.5 కోట్లు సమర్పయామి

  • శ్రీశైలంలో ఉభయ హుండీల్లో జమ
  • 131.300 గ్రాముల బంగారం
  • 5 కేజీల 50 గ్రాముల వెండి
  • విదేశీ కరెన్సీ సైతం
  • సమర్పించిన భక్తులు

శ్రీశైలం, నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : శ్రీశైలంలో వేంచేసిన శ్రీ భ్రమరాంభిక మల్లికార్జున స్వామి(Sri Bhramarambhika Mallikarjuna Swamy) ఉభయ దేవాలయాల హుండీల(Hundila)ను గురువారం తెరవగా, ఆది దంపతులకు 29 రోజుల ఆదాయం(Income) సుమారు రూ. 3.5 కోట్లుగా లెక్క తేలింది.

శ్రీశైలంలోని చంద్రావతి(Chandravati) కల్యాణమండపంలో గురువారం హుండీ లెక్కింపును డిప్యూటీ కార్య నిర్వహణ అధికారి రమణమ్మ(Ramanamma) పర్యవేక్షణలో జరిగింది. రూ.3,46,96,431 కోట్ల నగదు, 131. 300 గ్రాముల బంగారం(Gold), 5 కిలోల 50 గ్రాముల వెండి ఆభరణలను ఆదిదంపతులకు భక్తులు సమర్పించారు.

విదేశీ కరెన్సీ కూడా హుండీలో లభించినట్లు డిప్యూటీ ఈవో రమణమ్మతెలిపారు. పటిష్ట భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల(CCTV Cameras) నిఘాతో హుండీల లెక్కింపును నిర్వహించారు.

Leave a Reply