Rs. 200 crore | తూడుకుర్తిలో ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి ప్రచారం..

Rs. 200 crore | తూడుకుర్తిలో ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి ప్రచారం..

  • కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలి
  • ఎమ్మెల్సీ కుచ్ కుల దామోదర్ రెడ్డి

Rs. 200 crore | నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : నాగర్ క‌ర్నూల్ మండలంలోని తన స్వగ్రామమైన తూడుకుర్తి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సత్తవరం లక్ష్మి కరుణాకర్ రెడ్డి అభ్యర్థిని గెలిపించాలని ఎమ్మెల్సీ కుచుకుల దామోదర్ రెడ్డి ప్రచారం నిర్వహించారు.

నాగర్ కర్నూల్ మండలం రెండో విడత పోలింగ్(Polling) జరుగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి తన స్వగ్రామమైన తూడుకుర్తి గ్రామంలో ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించారు.

ఈదర్భంగా ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి మాట్లాడుతూ… తన రాజకీయ జీవితం ప్రారంభం ఈ గ్రామ సర్పంచ్ నుండే ప్రారంభమైందని ఆనాటి నుండి ఈనాటి వరకు తూడుకుర్తి గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధికి కృషి చేశామని తెలిపారు.

ఇప్పటివరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్(integrated with Rs. 200 crore) స్కూలు మంజూరు చేయించామని, త్వరలోనే పనులు కూడా ప్రారంభమవుతాయని తెలిపారు.

అదే కాకుండా అడ్వాన్సుడ్ ట్రైనింగ్ సెంట‌ర్ కూడా మంజూరు చేయించామని తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజీ, పారిశుద్ధ్యం లాంటి సమస్యలను కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించి గ్రామ అభివృద్ధికి కృషి చేశామని తెలిపారు.

తాను సర్పంచిగా, మండల పరిషత్ అధ్యక్షునిగా, జడ్పీ చైర్మన్ గా, ఎమ్మెల్సీగా రెండుసార్లు పనిచేసిన సందర్భంలో గ్రామ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేశానని, ఏ పదవిలో ఉన్నా నాగర్ క‌ర్నూల్ నియోజకవర్గ అభివృద్ధి(Constituency Development)కి కృషి చేశానని, తన స్వగ్రామమైన తూడుకుర్తికి, మండలానికి ఎన్నో నిధులు కేటాయించి తన శాయాశ‌క్తులా తన రాజకీయ జీవితంలో అభివృద్ధికి కృషి చేశాన‌న్నారు.

కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను నియోజకవర్గంలో గెలిపించాలని ఆయన కోరారు. ఆయన వెంట మాజీ ఎంపీపీ కోటయ్య ఇంద్రారెడ్డి, ఆ గ్రామ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply