రూ.2.44 కోట్లతో ఐదు రోడ్లు మంజూరు

రూ.2.44 కోట్లతో ఐదు రోడ్లు మంజూరు

మోపిదేవి మండలంలో మూడు రోడ్లకు రూ.1.46లక్షలు
చల్లపల్లి మండలంలో రెండు రోడ్లకు రూ.98 లక్షలు
అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్

అవనిగడ్డ – ఆంధ్రప్రభ : రూ.2.44 కోట్లతో నాలుగు ప్రధాన రహదారులు మంజూరైనట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ద్వారా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె పండుగ-2.0 కార్యక్రమంలో భాగంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో ఈ నాలుగు రోడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు.

మోపిదేవి మండలం మోపిదేవి- వెంకటాపురం ప్రధాన రహదారి 0.0 కిలోమీటర్ నుంచి 2.0 కిలోమీటర్ వరకూ రూ.48 లక్షలు, 2.0కిలోమీటర్ నుంచి 3.9 కిలోమీటర్ వరకూ రూ.49 లక్షలు మొత్తం 3.9 కిలోమీటర్లు నూతన బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.97 లక్షలు మంజూరు అయినట్లు తెలిపారు. మోపిదేవి వద్ధ జాతీయ రహదారి-216 నుంచి కొక్కిలిగడ్డ వెళ్లే ప్రధాన రహదారి బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.49 లక్షలు మంజూరు అయినట్లు ఎమ్మెల్యే వివరించారు.

చల్లపల్లి మండలంలో నడకుదురు గ్రామ పంచాయతీ పరిధిలోని రాముడుపాలెం గ్రామ ప్రధాన రహదారి బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.49 లక్షలు, నాదెళ్లవారిపాలెం రోడ్డు నిర్మాణానికి రూ.49 లక్షలు నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే వివరించారు.

Leave a Reply