Rs.1800 crore | రైతుల ఉసురు పోసుకుంటున్న ప్రభుత్వాలు

Rs.1800 crore | రైతుల ఉసురు పోసుకుంటున్న ప్రభుత్వాలు
- రూ. 1800 కోట్ల బోనస్ బకాయి చెల్లించాలి
- షరతులు లేకుండా రైతు బంధు ఇవ్వాలి
- మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు
Rs.1800 crore | మెదక్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల ఉసురు పోసుకుంటున్నాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు(MLA Harish Rao) పేర్కొన్నారు. ఇవాళ మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాల వల్ల రాష్ట్రంలో రైతాంగం పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఎరువులు, విత్తనాలు, యూరియా(Urea) దొరకని పరిస్థితి నెలకొందన్నారు. రుణమాఫీ, రైతుబంధు, బోనస్ విషయంలో రైతులను దారుణంగా మోసం చేసిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు రూ.1800 కోట్లు(Rs. 1800 crore) సన్న వడ్లకు బోనస్ బకాయిలు ఉన్నట్లు తెలిపారు. గతేడాది యాసంగి సన్న వడ్ల బోనస్ రూ. 1200 కోట్లు, ఈ వానకాలానికి సంబంధించి రూ. 600 కోట్లు ఉన్నాయని, ఆ మొత్తం బోనస్ డబ్బులను రైతులకు ఎప్పుడిస్తారని ప్రశ్నించారు.
Rs.1800 crore |సింగూరు నీటి విడుదల పై స్పష్టత ఇవ్వాలి

ఏడుపాయల అమ్మవారి సాక్షిగా రేవంత్ రెడ్డి పంద్రాగస్టు వరకు వంద శాతం రుణ మాఫీ చేస్తానని చెప్పి 40శాతం(40 percent) మాత్రమే చేశారని విమర్శించారు. ఎరువులు, విత్తనాలు, పంట కొనుగోళ్లలో ఫెయిలయ్యారని దుయ్యబట్టారు. ఈ ప్రభుత్వంలో రెండు పంటలకు రైతు బంధు ఎగ్గొట్టారని, తక్షణమే ఆ డబ్బులను విడుదల చేయాలన్నారు. రైతులకు కరెంట్, నీరు యూరియా సరఫరా చేయడం ప్రభుత్వానికి చేతగాక మ్యాప్ లు అప్ ల పేరిట నాటకాలు ఆడుతోందని మండిపడ్డారు. అక్షరాస్యత లేని రైతులు, స్మార్ట్‌ఫోన్లు లేని మహిళా రైతులు అధికారుల చుట్టూ తిరగలేరని, నెట్‌వర్క్ సిగ్నల్స్(network signals) లేని గ్రామాల్లో రైతులు ఈ యాప్‌లు ఎలా వాడతారని ప్రశ్నించారు. ఇది కేవలం ఎరువుల సరఫరాను తగ్గించి రైతులను వేధించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఆడుతున్న నాటకమని చెప్పారు.

Rs.1800 crore |సాగునీరు ఇవ్వకుంటే క్రాఫ్ హాలిడే ప్రకటించాలి
పత్తి రైతులకు కపాస్ యాప్ తెచ్చి బీజేపీ ముంచితే, ఎరువుల కోసం యాప్ తెచ్చి కాంగ్రెస్ ముంచుతోందన్నారు. నాట్లు వేసే సమయం ఆసన్నమైనా అధికారులు(officials), పాలకులు స్పందించకపోవడంతో యాసంగి పంట సాగు చేయాలా వద్దా అన్న సందిగ్ధంలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారని తెలిపారు. రైతులు గత్యంతరం లేక మళ్ళీ బోర్లు వేస్తూ అప్పుల పాలవుతున్నారని చెప్పారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో బోరు బండి మాయమైందని, కాంగ్రెస్ వచ్చాక బోర్లు వేసే ఇబ్బందులు రైతులకు దాపురించాయన్నారు. ముఖ్యంగా సింగూరు ప్రాజెక్టు నుండి ఘనపురం ఆనకట్టకు సాగునీరు విడుదల చేస్తారా లేదా అన్న అంశంపై ప్రభుత్వం ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వకపోవడం దారుణమున్నారు. పాపన్నపేట, హవేలీఘన్పూర్, కొల్చారం, మెదక్ రూరల్ మండలాల్లోని వేలాది ఎకరాలు ఘనపురం కట్టపైనే ఆధారపడి వ్యవసాయం సాగు చేస్తున్నట్లు తెలిపారు.
Rs.1800 crore |ప్రాజెక్టును మరమ్మతులు చేసే అవకాశం ఉన్నా
సింగూరు ప్రాజెక్టు మరమ్మతుల పేరుతో ప్రభుత్వం నీటిని ఖాళీ చేసిందన్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో ఉన్న 17 టీఎంసీల(17 TMC) నీటితో పంటను కాపాడుతూ ప్రాజెక్టును మరమ్మతులు చేసే అవకాశం ఉన్నా ప్రభుత్వానికి ఆ చిత్తశుద్ధి లేదన్నారు. సింగూరు నీటిపై మెదక్, నిజామాబాద్ రైతుల హక్కును కాపాడాలన్నారు. తక్షణమే నీటి విడుదలపై స్పష్టమైన ప్రకటన చేయాలని, లేని పక్షంలో క్రాఫ్ హాలిడే ప్రకటించి ఎకరాకు తగిన నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. యాసంగి సీజన్ ప్రారంభమైనా పెట్టుబడి సాయం ఊసే లేదన్నారు. సాగుచేసిన వారికే రైతు బంధు ఇస్తామంటూ సాకులు వెతుకుతూ పత్తి, చెరుకు, పసుపు రైతులకు ఎగనామం పెట్టాలని చూస్తున్నారన్నారు. ఎటువంటి కోతలు లేకుండా రైతుబంధు నిధుల(funds)ను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Rs. 1800 crore |ఫెర్టిలైజర్ షాపుల ద్వారా యూరియా అందించాలి..
కౌలు రైతుల భవిష్యత్తును ఈ ప్రభుత్వం ప్రశ్నార్థకం చేసిందని, తక్షణమే ఈ యాప్ నాటకాలు బంద్ చేసి, గతంలో మాదిరిగా ఫెర్టిలైజర్ షాపుల ద్వారా యూరియా అందించాలన్నారు. తక్షణమే రుణమాఫీ(loan waiver) పూర్తి చేయాలని, బోనస్ బకాయిలు చెల్లించాలి, రైతుబంధు విడుదల చేయాలని, ఘనపురం ఆనకట్ట నీటిపై స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేయాలని బిఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నట్లు వివరించారు.
ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి(Shashidhar Reddy), నియోజకవర్గ ఇంచార్జి కంటారెడ్డి తిరుపతి రెడ్డి, రాష్ట్ర నాయకులు దేవేందర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లిఖార్జున్ గౌడ్, పట్టణ కన్వీనర్ మామిళ్ల ఆంజనేయులు, మండల అధ్యక్షుడు అంజా గౌడ్, మాజీ కౌన్సిలర్ ఆకిరెడ్డి కృష్ణా రెడ్డి, పీఏసీఎస్ ఛైర్మెన్ హనుమంత్ రెడ్డి, సోములు, నాయకులు జీవన్ రావు, గంగా నరేందర్, జుబేర్, స్వామి నాయక్, చందు, శ్రీనివాస్ గౌడ్ తదితరులున్నారు.
CLICK HERE TO READ ఇంట్లో భారీ చోరీ.. 40తులాల బంగారం అపహరణ