ఏసీబీకి పట్టుబడ్డ మండల ఇన్చార్జి విద్యాధికారి…

ఏసీబీకి పట్టుబడ్డ మండల ఇన్చార్జి విద్యాధికారి…

మహబూబాబాద్, ఆంధ్రప్రభ : మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల విద్యాధికారిగా పనిచేస్తున్న రవీందర్, అయోధ్య పురం జిల్లా పరిషత్ హై స్కూల్లో స్కూల్ అసిస్టెంట్ గా పని చేస్తున్న చంద్రమౌళిలు రూ.15000 లంచం తీసుకుంటూ ఏసీబీకి బుధవారం పట్టుపడ్డారు. జిల్లా పరిషత్ హై స్కూల్ అయోధ్య పురం హెడ్మాస్టర్ గూడూరు మండల విద్యాధికారిగా ఇంచార్జ్ గా పనిచేస్తున్నారు.

ఇదే మండలంలోని గుండెంగ గ్రామ శివారు వాగ్య తండాకు లోని ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న రవీందర్ అనే ఉపాధ్యాయుడు పదవి విరమణకు సంబంధించిన ఫైల్స్ పై సంతకాలు పెట్టాలంటే రూ.15000 ఇస్తేనే పెడతామని నెల రోజులపాటు ఇబ్బందులకు గురి చేయడం జరిగిందని బాధితుడు తెలిపారు. తన వద్ద డబ్బులు లేక ఏసీబీని ఆశ్రయించడం జరిగిందని వారు తెలిపారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply