ఓరుగల్లులో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్

ఓరుగల్లులో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్

  • గుట్టురట్టు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు
  • ఆర్గనైజర్,11 మంది బెట్టింగ్ ప్లేయర్స్ అరెస్ట్
  • లక్ష 6 వేల నగదు,12 స్మార్ట్ మొబైల్స్ సీజ్

వరంగల్ క్రైమ్, ఆంధ్రప్రభ ; కోట్లాది మంది క్రికెట్ అభిమానులను ఉర్రూతలుగిస్తున్న ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ ల హోరుతో దేశ వ్యాప్తంగా క్రికెట్ బెట్టింగ్స్ జోరు సాగుతోంది.ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ పోకడ ఓరుగల్లుకు పాకింది. నగరంలో గుట్టుగా సాగుతున్న ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ ను వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు బట్టబయలు చేశారు. హన్మకొండలోని గోపాల్ పూర్ ఏరియా కేంద్రంగా సాగుతున్న ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ పై టాస్క్ ఫోర్స్ పోలీసులు పక్కా సమాచారం అందుకొన్నారు.

టాస్క్ ఫోర్స్ ఏసీపీ ఎలిగేటి మధుసూధన్ పర్యవేక్షణలో ఇన్స్ పెక్టర్ సార్ల రాజు సారథ్యంలో దాడి చేసి ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న నిర్వహకుడితో పాటు 11 మంది బెట్టింగ్ ప్లేయర్స్ ను అరెస్ట్ చేశారు. వారి నుండి ఒక లక్ష 6 వేల రూపాయల నగదు, 12 స్మార్ట్ మొబైల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. గోపాల్ పూర్ లోని వెంకటేశ్వర కాలనీకి చెందిన ఆర్గనైజర్ గట్ల రాజేష్ (34) క్రిక్ 666 .లైవ్ సైట్ ద్వారా బెట్టింగ్ దందా నిర్వహిస్తున్న గుట్టును బట్టబయలు చేశారు.

హన్మకొండ చింతగట్టుకు చెందిన గర్నపల్లి.అరవింద్ (35),ముప్పారపు రాజేంద్రప్రసాద్ (44), పడమరకోటకు చెందిన చిట్ల రాజేష్ (24), దేవర వినయ్ (36), జెట్టబోయిన కుమార్ (34),జనగామ జిల్లా చిల్పూర్ మండలం శ్రీపతిపల్లికి చెందిన వంగ శివకుమార్ (25),బాషాబోయిన శ్రీకాంత్ (24),ఈర్ల విఘ్నేష్ (25), స్టేషన్ ఘన్ పూర్ మండలం కొత్తపల్లికి చెందిన గంగుల అనిల్ (32), బురు మధుకర్ (34), పింగిల్ల రవీందర్ (35) లను అరెస్ట్ చేశారు. తదుపరి విచారణ కోసమై కేయుసి పోలీసులకు అప్పగించారు.

Leave a Reply