జైపూర్ : జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరుగుతున్నఐపీఎల్ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేపట్టిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. రాజస్థాన్ రాయల్స్ కు 220 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. పంజాబ్ కింగ్స్ బ్యాటర్లలో నేహల్ వధేరా 70, శశాంక్ సింగ్ 59 పరుగులతో రాణించారు.
అలాగే శ్రేయస్ అయ్యర్ 30, ప్రభుసిమ్రన్ సింగ్ 21, అజ్మతుల్లా ఒమర్జాయ్ 21 పరుగులతో ఫర్వాలేదనిపించారు. ప్రియాంశ్ ఆర్య 9, మిచెల్ ఓవెన్ 0 విఫలమయ్యారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో తుశార్ దేశ్పాండే 2, క్వెనా మపాకా, రియాన్ పరాగ్, ఆకాశ్ మద్వాల్ తలో వికెట్ తీసుకున్నారు. రాజస్థాన్ రాయల్స్ విజయ లక్ష్యం చేరుకోవాలంటే నిర్ణీత 20 ఓవర్లలో 220 పరుగులు చేయాల్సి ఉంది.