Vijay Devarakonda | విజయ్ కి టర్నింగ్ పాయింట్ కానుందా…?

Vijay Devarakonda | విజయ్ కి టర్నింగ్ పాయింట్ కానుందా…?
- వరుస ఫ్లాప్స్ తర్వాత విజయ్ దేవరకొండ ఫోకస్
- రౌడీ జనార్థన గ్లింప్స్‌తో క్రియేట్ అయిన బజ్
- సీనియర్ హీరో రాజశేఖర్, హీరోయిన్ శోభన పాత్రలపై టాక్
- పవర్ ఫుల్, వయోలెంట్ కథతో విజయ్ కొత్త ప్రయోగం
- పాన్ ఇండియా లెవల్‌లో విడుదలకు సిద్ధమైన సినిమా
Vijay Devarakonda |ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ.. (Vijay Devarakonda) ఈమధ్య కాలంలో కెరీర్ లో బాగా వెనబడ్డాడు. అందుకనే.. ఈసారి గురి తప్పేదేలే అన్నట్టుగా రెండు సినిమాలు పక్కాగా ప్లాన్ చేస్తున్నాడు. ఒకటి రౌడీ జనార్థన కాగా రెండోది రణబాలి. అయితే.. రౌడీ జనార్థన మూవీలో సీనియర్ హీరో అండ్ హీరోయిన్ నటించబోతున్నారని వార్తలు వస్తుండడం ఆసక్తిగా మారింది. ఇంతకీ.. ఆ సీనియర్ హీరో అండ్ హీరోయిన్ ఎవరు..? విజయ్ కి ఈ సినిమా విజయాన్ని అందించేనా..?
Vijay Devarakonda | పవర్ ఫుల్ రోల్ లో.. రౌడీ జనార్థన..
విజయ్ దేవరకొండ హీరోగా డైరెక్టర్ రవికిరణ్ కోలా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇందులో పవర్ ఫుల్ గా.. ఇంకా చెప్పాలంటే.. ఇంతకు ముందు ఎప్పుడూ విజయ్ ని (Vijay) చూడని విధంగా చూపించబోతున్నారని తెలుస్తోంది. బండెడు అన్నం తిని గుండెడు రక్తం తాగే రాక్షసుడి గురించి ఎప్పుడన్నా విన్నారా.. నేను చూశాను. కొమ్ములతో వాడి కథను వాడే రాసుకున్నోడు. కన్నీళ్లను ఒంటికి నెత్తురులాగా పూసుకున్నోడు. సావు కళ్లముందుకొచ్చి నిలబడితే.. కత్తై లేచి కలబడినోడు కనబడ్డాడు నాలోపల అంటూ విజయ్ దేవరకొండ పవర్ ఫుల్ వాయిస్ ఓవర్ తో ప్రారంభమైన ఈ గ్లింప్స్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఈ వీడియోలో జనార్ధన క్యారెక్టర్ ఏంటనేది పరిచయం చేశారు. దీంతో మూవీ పై మరింత బజ్ క్రియేట్ అయ్యింది.

Vijay Devarakonda | ఆ ఇద్దరు సీనియర్స్ జంటగా..
ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ పాత్రను యాంగ్రీమేన్ రాజశేఖర్ (Rajashekar) పోషిస్తున్నారని ఆమధ్య వార్తలు వచ్చాయి. అయితే.. మేకర్స్ మాత్రం దీని గురించి నిజమా కాదా అనేది క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పుడు విజయ్ కి తల్లి పాత్రలో సీనియర్ హీరోయిన్ శోభన నటిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు కూడా మేకర్స్ నుంచి ఎలాంటి కన్ ఫర్మమేషన్ లేదు. ఇందులో రాజశేఖర్ పాత్ర చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని టాక్ వినిపిస్తుంది. ప్లాష్ బ్యాక్ లో విజయ్, తల్లిదండ్రుల పాత్రలు కనిపిస్తాయని.. ఆ ఎపిసోడ్ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని ప్రచారం జరుగుతుంది. ఇక విజయ్ కి జంటగా కీర్తి సురేష్ నటిస్తుంది.

Vijay Devarakonda | అందుకే.. ఈ కథతో..
ఈ గ్లింప్స్ లో విజయ్ ఒంటినిండా బ్లడ్ తో చాలా మాస్ గా పవర్ ఫుల్ గా (Powerfull) కనపించాడు. ఇప్పుడు వయోలెన్స్ ఎక్కువుగా ఉన్న సినిమాలు బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధిస్తున్నాయి. అందుకనే.. ఈ తరహా కథను విజయ్ ఎంచుకున్నాడనే టాక్ వినిపిస్తుంది. తెలుగుతో పాటుగా హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాని రూపొందిస్తున్నారు. 2026 డిసెంబర్ లో ఈ భారీ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా సక్సెస విజయ్ కి చాలా కీలకం. అందుకనే ఈ మూవీ పై విజయ్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. గ్లింప్స్ రిలీజ్ తర్వాత విజయ్ కి విజయం ఖాయమనే టాక్ వచ్చింది. మరి.. ప్రచారంలో ఉన్నట్టుగా రౌడీ జనార్థన సక్సెస్ అందిస్తుందేమో చూడాలి.

