రోస్టర్ పాయింట్లలో మాలలకు తీవ్ర అన్యాయం

రోస్టర్ పాయింట్లలో మాలలకు తీవ్ర అన్యాయం

సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : తెలంగాణ మాల ఉద్యోగుల సంఘం జిల్లా కార్యాలయం ఘనంగా ప్రారంభమైంది. సంగారెడ్డి బైపాస్ రోడ్డులోని టెలిఫోన్ కాలనీలో, మన హాస్పిటల్ ఎదురుగా ఏర్పాటు చేసిన ఈ కార్యాలయాన్ని రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ దుర్గయ్య రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో సంఘం అధ్యక్షులు బక్కన్న మాట్లాడుతూ మాల జాతి అభ్యున్నతి కోసం, హక్కుల పరిరక్షణ దిశగా సంఘం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.

సంఘం ప్రధాన కార్యదర్శి బి.రాజు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణను శాస్త్రీయంగా అమలు చేయాలని, వర్గీకరణ అనంతరం రోస్టర్ పాయింట్లలో మాలలకు జరిగిన అన్యాయాలను సవరించాలని పలు కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ఈ క్రమంలో జిల్లా కార్యాలయం ప్రారంభించడం సంఘానికి మరో ముఖ్యమైన ముందడుగుగా పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ప్రిన్సిపాల్ మాదేవిని అనంతయ్య, మల్లేశం, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దేవయ్య, విజయరావు, పుండరికం, ఉషాకాంత్, ప్రముఖ న్యాయవాది రామారావు, రత్నాకర్, అగ్రికల్చర్ ఆఫీసర్ డాక్టర్ వైద్యనాథ్ తదితరులు పాల్గొని మాట్లాడారు. వ్యక్తుల కంటే సంఘం గొప్పదని, ఏ పదవిలో ఉన్నా సంఘ అభివృద్ధి కోసం కృషి చేయాలని, అలాగే సంఘ నియమ నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాల ఉద్యోగుల సంఘం నాయకులు జయరాములు, మల్లేశం, శ్రీనివాసులు, నరసయ్య, దేవరాజు, కుండరికం, రవీందర్, నరసయ్య, నర్సింలు, విట్టల్ తదితరులతో పాటు సుమారు 50 మంది ఉద్యోగులు పాల్గొన్నారు.

Leave a Reply