సెంచ‌రీతో చెల‌రేగిన రోహిత్ శ‌ర్మ‌

సెంచ‌రీతో చెల‌రేగిన రోహిత్ శ‌ర్మ‌

హాఫ్ సెంచ‌రీ పూర్తిచేసుకున్న కోహ్లీ

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్ డెస్క్ : ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న మూడో వ‌న్డేలో రోహిత్ శ‌ర్మ సెంచ‌రీ చేశాడు. వ‌న్డ‌ల్లో అత‌నికి ఇది 33వ సెంచ‌రీ. 105 బంతుల్లో 11 ఫోర్లు, రెండు సిక్స‌ర్ల‌తో శ‌ర్మ సెంచ‌రీ పూర్తి చేశాడు. 237 ర‌న్స్ టార్గెట్‌తో బ‌రిలోకి దిగిన భార‌త్‌.. విజ‌యం వైపు దూసుకెళ్తోంది. రోహిత్‌, కోహ్లీ అజేయంగా రెండో వికెట్‌కు 100 పైగా ర‌న్స్ జోడించారు. రెండో వ‌న్డేలో హాఫ్ సెంచరీ కొట్టిన రోహిత్‌, ఇక మూడో వ‌న్డేలో సెంచ‌రీతో ఆక‌ట్టుకున్నాడు. బాధ్య‌తాయుతంగా బ్యాటింగ్ చేశాడు. బౌండ‌రీల‌తో స్కోరు బోర్డును ప‌రుగెత్తించాడు. వీలైన సంద‌ర్భంలో సింగిల్స్ తీస్తూ స్ట్ర‌యిక్ రొటేట్ చేశాడు. కోహ్లీ హాఫ్ సెంచ‌రీ పూర్తి బ్యాటింగ్ చేస్తున్నాడు.

Leave a Reply