చిదందరామ్ స్టేడియంలో చెన్నైతో జరుగుతున్న మ్యాచ్ లో ముంబైకి తొలి ఓవర్లలోనే ఎదురుదెబ్బ తగిలింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తుంన్న ముంబై వరుస వికెట్లు కోల్పోతుంది. ఖలీల్ అహ్మద్ వేసిన తొలి ఓవర్ నాలుగో బంతికి రోహిత్ శర్మ డకౌట్ గా వెనుదిరగగా.. రెండో ఓవర్లో ర్యాన్ రికెల్టన్ (13) పరుగులకు ఔటయ్యాడు. ఇక అశ్విన వేసిన 4.4 ఓవర్లో విల్ జాక్స్ (11) పెవిలియన చేరాడు. దాంతో 4.4 ఓవర్లలోనే ముంబై జట్టు 36 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది.
ఇదిలా ఉండగా, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (7) – తిలక్ వర్మ ప్రస్తుతం క్రీజులో ఉన్నారు. 5 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 44/3.