ROADS | బస్టాండ్ ప్రాంతంలో ఉన్న షాపుల తొలగింపు

ROADS | బస్టాండ్ ప్రాంతంలో ఉన్న షాపుల తొలగింపు
- పరకాల పోలీసుల ఆధ్వర్యంలో
ROADS | పరకాల, ఆంధ్రప్రభ : పట్టణంలోని బస్టాండ్ ప్రాంతంలో రోడ్లను ఆక్రమించి వ్యాపారాలు నిర్వహించే షాపులను పోలీసుల ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బంది తొలగించారు. ఈ రోజు పరకాల పోలీస్ సీఐ వి క్రాంతి కుమార్ నేతృత్వంలో పరకాల బస్టాండ్‌కు బస్సులు లోనికి, బయటకి వెళ్లే మూలల (కార్నర్) వద్ద పండ్ల షాపులు, పాన్ షాపులు రోడ్లని ఆక్రమించి నిర్వహించడం వల్ల రోడ్డు ఇరుకుగా ఏర్పడి ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో రోడ్డు ప్రమాద నివారణ చర్యల్లో భాగంగా పరకాల బస్టాండ్ ప్రాంతంలో రోడ్డును ఆక్రమించి నిర్వహిస్తున్న దుకాణాలను తొలగించారు. ఈ సందర్భంగా ప్రజలు పోలీస్ శాఖ సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు.
