Road repairs | భట్టుపల్లి సర్పంచ్ బరిలో ఆడబిడ్డ…

Road repairs | భట్టుపల్లి సర్పంచ్ బరిలో ఆడబిడ్డ…

  • అప్పాల సుమలత గెలుపు ఖాయం అంటున్న గ్రామస్తులు

Road repairs | మంథని, ఆంధ్ర‌ప్ర‌భ : స్థానిక సంస్థ ఎన్నికల్లో మంథని మండలం భట్టుపల్లి గ్రామం సర్పంచ్ బరిలో ఆడబిడ్డ అప్పాల సుమలత అశోక్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. స్థానిక సంస్థ ఎన్నికల్లో ఉంగరం గుర్తుకు ఓటెయ్యాలని ఆమె కోరారు. ఎన్నికల్లో అవకాశం కల్పించాలని, ఎన్నికల సంఘం వారు ఉంగరం గుర్తును(ring) కేటాయించారు.

ఉంగరం గుర్తుకు ఓటెయ్యాలని, ప్రజలందరికీ అందుబాటులో ఉంటారని ఆమె తెలిపారు. ప్రతి ఇంటి ఆడబిడ్డల ప్రజాసేవ చేస్తానని ఆమె తెలిపారు.సర్పంచ్ గా అవకాశం కల్పిస్తే, ప్రజాసేవకు అంకితం అవుతానని, ఎప్పటికప్పుడు గ్రామాన్ని పరిశుభ్రంగా ఉండేలా చూస్తానని హామీ ఇచ్చారు. రోడ్డు మరమ్మత్తులు(Road repairs), డ్రైనేజీ వ్యవస్థ మరమ్మత్తులు చేయిస్తానని ఆమె తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తానని ఆమె తెలిపారు.

ఉంగరం గుర్తుకు ఓటేసి అవకాశం కల్పిస్తే నాణ్యమైన పరిపాలన ప్రజలందరికీ అందిస్తానని ఆమె భరోసా కల్పించారు. ఖచ్చితంగా ప్రజలంతా ఉంగరం గుర్తుకు ఓటేసి సుమలతను గెలిపించుకుందామని ఆమె తరపున ప్రచారం చేస్తున్నారు.

Leave a Reply