Road Accident | ఎస్సై నరేష్ కు గాయాలు..

Road Accident | ఎస్సై నరేష్ కు గాయాలు..
Road Accident, తుగ్గలి, ఆంధ్రప్రభ : సంక్రాంతి పండుగ సందర్భంగా జరిగే కోడి పందేల పోటీలను అడ్డుకునేందుకు బైకు పై వెళుతున్న ఎస్సై నరేష్ కింద పడడంతో గాయాలయ్యాయి. మండలంలోని నంద్యాల, కర్నూలు, అనంతపురం జిల్లాల సరిహద్దు ప్రాంతమైన రామకొండ పరిసర ప్రాంతాలలో సంక్రాంతి సందర్భంగా కోడి పందేల పోటీలు నిర్వహిస్తున్నట్లు తుగ్గలి పోలీసులకు సమాచారం వచ్చింది.
దీంతో తుగ్గలి ఎస్సై నరేష్ తన సిబ్బందితో సివిల్ దుస్తులతో ద్విచక్ర వాహనాల పై వెళ్లారు. గాయాలైన ఎస్సై నరేష్ పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఈ విషయం తెలుసుకున్న పత్తికొండ రూరల్ సీఐ పులి శేఖర్ పత్తికొండ ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చి చికిత్స పొందుతున్న ఎస్సై నరేష్ ను పరామర్శించారు. అనంతరం జరిగిన సంఘటన పై సీఐ పులి శేఖర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు.
