Road Accident | భైంసాలో ఘోర ప్రమాదం..

Road Accident | భైంసాలో ఘోర ప్రమాదం..
Road Accident, భైంసా, ఆంధ్రప్రభ : భైంసా పట్టణంలో సోమవారం అర్ధరాత్రి సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మృతులు హైదరాబాదు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బైoసా బస్ డిపో సమీపంలో ఎర్టిగా కారు, కంటైనరు ఢీకొనడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఇంకా ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. మృతులు కుబీర్ మండలంలోని కుట్టి గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. స్థానికులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహాయ సహకారాలు అందించారు.
