ప్రమాదాల నివారణకు చర్యలు..

ప్రమాదాల నివారణకు చర్యలు..

రోడ్డుకి ఇరువైపుల పారిశుద్ధ్య పనులు.. పిచ్చి మొక్కలు తొలగింపు

జైనూర్, ఆంధ్రప్రభః ప్రమాదాల నిర్మూలనకు చర్యలు తీసుకుంటున్నట్లు పవర్ గూడ సర్పంచ్ తొడసం రాజేందర్ తెలిపారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని పవర్ గూడ లోని ప్రధాన రోడ్డు ఇరువైపులా పిచ్చి మొక్కలు పెరిగి అపరిశుభ్రంగా ఉండడంతో రోడ్డుకు ఇరువైపులా పిచ్చి మొక్కలను తొలగించి పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పటేల్ భీమ్రావు, కారోబార్ ఉయిక జ్ఞానేశ్వర్, గ్రామస్తులు చాహకటి నానాజీ, అనక లక్ష్మణ్, మరప సోము తదితరులు పాల్గొన్నారని సర్పంచ్ తెలిపారు.

Leave a Reply