Road | ఇద్దరు మృతి

Road | ఇద్దరు మృతి

Road | ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్ : పొగాకు కోతలకు వెళ్తుండగా.. ఆటో బోల్తాపడి ఇద్దరు మృతిచెందగా, మరికొందరు గాయపడ్డ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని లింగసముద్రం మండలం కే సముద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో బోల్తా పడిన ఘటనలో ఇద్దరు కూలీలు దుర్మరణం చెందారు. పోగాకు కోతలకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మరికొంతమంది సైతం గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

మృతిచెందిన ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతులు, క్షతగాత్రుల కుటుంబాలకు సమాచారం అందించారు. ఘటనపై కేసు నమోదు చేశారు. అతివేగం వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు.

Leave a Reply