మిషన్ భగీరథ – ఆర్‌ఓ నీటి మధ్య తేడాపై అవగాహన

మిషన్ భగీరథ – ఆర్‌ఓ నీటి మధ్య తేడాపై అవగాహన
అచ్చంపేట, ఆంధ్రప్రభ : ఉప్పునుంతల మండలం, పిరట్వానిపల్లి గ్రామపంచాయతీలో తాగునీటి విషయంలో మిషన్ భగీరథ డిఈ హేమలత ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మిషన్ భగీరథ ద్వారా సరఫరా అవుతున్న తాగునీరు మరియు ఆర్‌ఓ నీటి మధ్య ఉన్న తేడాలను గ్రామస్తులకు ఆమె వివరించారు. మిషన్ భగీరథ నీరు శుద్ధి చేసిన ఉపరితల జలాలు కావడంతో ఆరోగ్యానికి అవసరమైన ఖనిజాలు ఉండి తాగడానికి అనుకూలంగా ఉంటుందని తెలిపారు. కాగా ఆర్‌ఓ నీటిలో శుద్ధి ప్రక్రియలో చాలా ఖనిజాలు తొలగిపోతాయని వివరించారు.
ప్రజలు ప్రభుత్వం అందిస్తున్న మిషన్ భగీరథ తాగునీటిని వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలు కేకు కట్ చేసి సంబరాలు చేసుకొని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకొని డిఈ హేమలతను గ్రామస్తులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ సిబ్బంది, గ్రామపంచాయతీ ప్రతినిధులు, అధికారులు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.

