గజెల్లి మోహన్‌కు జాతీయ ఉగాది పురస్కారం..

గజెల్లి మోహన్‌కు జాతీయ ఉగాది పురస్కారం..

తార ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో నల్ల వజ్రం అవార్డు ప్రధానం

బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : సామాజిక సేవా రంగంలో విశేష కృషి చేస్తున్న బెల్లంపల్లికి చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త, లెక్చరర్ గజెల్లి మోహన్ జాతీయ స్థాయి ఉగాది పురస్కారానికి ఎంపికయ్యారు. హైదరాబాద్‌కు చెందిన తార ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం గోదావరిఖనిలోని ఆర్కే గార్డెన్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని అందజేశారు. అకాడమీ అధ్యక్షుడు సంకె రాజేష్ అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలో రామగుండం ఏసీపీ ప్రతాప్, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఘంటాడి కృష్ణ, అంతడుగుల నాగరాజు చేతుల మీదుగా మోహన్ ఈ అవార్డును స్వీకరించారు. గత 30 ఏళ్లుగా సంఘమిత్ర యూత్ క్లబ్, జన విజ్ఞాన వేదిక, లోక్ సత్తా, జ్ఞానమిత్ర గ్రంథాలయం వంటి సంస్థల ద్వారా మోహన్ అనేక సామాజిక కార్యక్రమాలు చేపట్టారు.

అక్షరాస్యత పెంపు, మూఢనమ్మకాలపై అవగాహన, పర్యావరణ పరిరక్షణ, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్‌గా విద్యార్థులతో గ్రామీణ ప్రాంతాల్లో సేవా శిబిరాల నిర్వహణ వంటి అంశాల్లో చురుగ్గా పాల్గొన్నారు. మేడారం, బుగ్గ జాతరలు, గోదావరి పుష్కరాల సమయంలో వాలంటీర్ల ద్వారా సేవలు అందించారు. గతంలో ఈయన సేవలను గుర్తించి రాష్ట్ర గవర్నర్ ద్వారా ‘యాప్త’ అవార్డు, ఉత్తమ రక్తదాత, స్టేట్ బెస్ట్ సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వంటి అనేక పురస్కారాలు లభించాయి. తాజాగా జాతీయ స్థాయి ఉగాది పురస్కారం దక్కడంపై పట్టణ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply