Rising Silver | వెండి కొండే..

Rising Silver | వెండి కొండే..
- ఉత్పత్తి తగ్గి.. డిమాండ్ పెరిగిందోచ్
- తారా స్థాయికి పారిశ్రామిక వినియోగం
- ఇటు సోలార్ వెలుగులు
- అటు ఈవీ కార్ల జోరు
- నడుమ ఏఐ సర్వర్లు
- తాజా డిమాండ్ 835 మిలియన్ ఔన్సులు
ఆంధ్రప్రభ, బిజినెస్ డెస్క్ : గత ఏడాదిగా బంగారం (Gold) ధర కొండెక్కుతుంటే… పసిడి ప్రేమికులు గిలగిల్లాడుతున్నారు. ఇక బంగారం ధరతో పోటీ పడి మరీ వెండి (Silver) శిఖరాన్ని తాకుతోంది. ఏకంగా 2025లో వెండి ధర సుమారు 120% నుంచి 130% పైగా పెరగడం గమనార్హం.
ఇప్పటి వరకూ బంగారం వినియోగంలో భారత దేశం ప్రపంచంలోనే రెండవ స్థానంలో ఉంది. ఏటా 850 టన్నుల బంగారాన్ని… 8000 టన్నుల వెండిని భారతీయలు వినియోగిస్తున్నారు. తాజాగా బంగారం ధరతో వెండి ధర కూడా తీవ్ర పోటీ ఇస్తోంది. 2025 డిసెంబర్ 18న హైదరాబాద్ , విజయవాడలో కిలో వెండి ధర సుమారు రూ.2,24,000కు చేరింది. అంటే రూ.2,000 పెరిగింది. ఢిల్లీ, ముంబై నగరాల్లో కిలో వెండి ధర సుమారు రూ.2,11,000 గా నమోదైంది.
Rising Silver | ఎందుకు పెరుగుతోంది…
పారిశ్రామిక డిమాండ్ తారా స్థాయికి చేరుతోంది. సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ వాహనాలు (EV), 5G టెక్నాలజీ, సెమీకండక్టర్ల తయారీలో వెండి వాడకం విపరీతంగా పెరగింది. ఫలితంగా డిమాండ్ భారీగా పెరిగింది.
Rising Silver | సరఫరా కొరత.
వెండి వెలికితీత (Mining) తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో ఈ 5వ యేట కూడా సరఫరా లోటు (Supply Deficit) కొనసాగుతోంది. దీనికి తోడు అమెరికన్ డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ పడిపోయింది. దిగుమతి చేసుకునే వెండి ధరలు దేశీయంగా మరింత భారమయ్యాయి.

Rising Silver | ఉత్పత్తి అంతంతే…
గత ఐదేళ్లలో గనుల నుండి వెండి ఉత్పత్తి దాదాపు స్థిరంగా ఉన్నప్పటికీ, మొత్తం సరఫరా డిమాండ్‌ను 2021లో కొవిడ్ తర్వాత 822 Moz (మిలియన్ ఔన్సులు) వెండి ఉత్పత్తి కోలుకుంది. 2022లో ఉత్పత్తి స్థిరంగా ఉంటే.. 2023లో మెక్సికోలో సమ్మెల కారణంగా తగ్గింది. 2024లో స్వల్పంగా తగ్గి 819.7 Mozలకు చేరింది. 2025లో 813 Moz నుంచి – 835 Moz డిమాండ్ ఉన్నా ఉత్పత్తి మాత్రం స్థిరంగా ఉంది.

Rising Silver | నిర్మాణాత్మక లోటు..
గత ఐదేళ్లలో (2021.. -2025) వరుసగా వెండి సరఫరా కంటే డిమాండ్ ఎక్కువగా ఉండటంతో మొత్తం 820 మిలియన్ ఔన్సుల కొరత ఏర్పడింది. ఇది దాదాపు ఒక సంవత్సరం ప్రపంచ ఉత్పత్తికి సమానం. గనుల ఉత్పత్తి పెరగకపోవడంతో పాత వెండిని రీసైక్లింగ్ చేయడం ద్వారా వచ్చే సరఫరా పెరిగింది.
2025లో రీసైక్లింగ్ ద్వారా వెండి ఉత్పత్తి 195 మిలియన్ ఔన్సులకు చేరుతుందని అంచనా. పాత గనులలో వెండి నిల్వలు తగ్గడం, కొత్త ప్రాజెక్టులు రాకపోవడం వెండిని విడిగా కాకుండా ఇతర లోహాలతో (రాగి, జింక్) కలిపి తీయాల్సి రావడం వల్ల ఉత్పత్తి వేగంగా పెరగడం లేదు.
Rising Silver | భవిష్యత్తు గతి..
విశ్లేషకుల అంచనాల ప్రకారం, పారిశ్రామిక డిమాండ్ కొనసాగితే 2026 నాటికి కిలో వెండి ధర రూ.2,40,000 మార్కును కూడా దాటే అవకాశం ఉంది. ప్రస్తుతం ఫిజికల్ వెండితో పాటు సిల్వర్ ఇటిఎఫ్ (Silver ETFs) డిజిటల్ సిల్వర్ వైపు మదుపరులు మొగ్గు చూపుతున్నారు.
Also Read : Profit Hunt | గోల్డ్.. గోల్డే
Rising Silver | తీరని కొరత..
ప్రపంచవ్యాప్తంగా వెండి (Silver) ప్రస్తుతం తీవ్రమైన కొరతను ఎదుర్కొంటోంది. 2025లో వరుసగా ఐదవ సంవత్సరం కూడా వెండి సరఫరా కంటే డిమాండ్ ఎక్కువగా ఉండటంతో అంతర్జాతీయ మార్కెట్లో ‘స్ట్రక్చరల్ డెఫిసిట్’ (నిర్మాణాత్మక లోటు) ఏర్పడింది. 2025లో ప్రపంచవ్యాప్తంగా గనుల నుండి వెండి ఉత్పత్తి సుమారు 813 మిలియన్ ఔన్సులుగా ఉంది.
ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్పత్తిదారు మెక్సికోలో సుమారు 202 మిలియన్ ఔన్సులు, చైనాలో 109 మిలియన్ ఔన్సులు. పెరూలో 107 మిలియన్ ఔన్సులు, పోలాండ్, చిలీ, రష్యా ఆస్ట్రేలియా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. సుమారు 70% వెండి ఇతర లోహాల (రాగి, సీసం, జింక్, బంగారం) వెలికితీతలో ఉప-ఉత్పత్తిగా (By-product) లభిస్తుంది. దీనివల్ల వెండి ధర పెరిగినా, కేవలం వెండి కోసం ఉత్పత్తిని వేగంగా పెంచడం గని కంపెనీలకు సాధ్యం కాదు.

Rising Silver | డిమాండ్ కి కారణాలు…
సోలార్ ప్యానెల్స్ తయారీలో వెండి కీలకం. 2025లో ప్రపంచవ్యాప్త వెండి వినియోగంలో 15 నుంచి 20% కేవలం సోలార్ రంగానిదే. ఇక ఎలక్ట్రిక్ వాహనాలు (EVs) పెరుగుతున్నాయి. సాధారణ పెట్రోల్/డీజిల్ కార్ల కంటే EVలలో 70% ఎక్కువ వెండి వాడతారు. ఒక్కో EVకి సగటున 25 నుంచి -50 గ్రాముల వెండి అవసరం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) డేటా సెంటర్లు ఆవర్భిస్తున్నాయి. AI సర్వర్లు , సెమీకండక్టర్ల తయారీలో వెండి వినియోగం విపరీతంగా పెరిగింది. సాధారణ సర్వర్లతో పోలిస్తే AI సర్వర్లలో 2-3 రెట్లు ఎక్కువ వెండి వాడతారు.
Rising Silver | ఇండియా స్థితి…
ప్రపంచవ్యాప్తంగా వెండి ఉత్పత్తిలో భారతదేశం 11వ స్థానంలో ఉంది. మొత్తం వెండి నిల్వలలో సింహభాగం రాజస్థాన్ రాష్ట్రంలోనే కేంద్రీకృతమై ఉంది. 87% ఈ రాష్ట్రంలోనే ఉన్నాయి. జార్ఖండ్ (5%), కర్ణాటక (2-5%), ఆంధ్రప్రదేశ్ (3%) వంటి రాష్ట్రాల్లో స్వల్ప నిల్వలు ఉన్నాయి. దేశంలో సుమారు 30,267 టన్నులు నిల్వ ఉన్నట్టు అంచనా. ఈ నిల్వల కొరత కారణంగానే అంతర్జాతీయ మార్కెట్లో వెండి ధర ఔన్స్‌కు $66 మార్కును దాటి, భారతదేశంలో కిలో వెండి ధర రూ.2,24,000 రికార్డు స్థాయికి చేరుకుంది. 2021లో ఔన్స్‌కు సుమారు $25 ఉన్న వెండి ధర, ఈ 2025 అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో $54.48 కు చేరింది.

ఇప్పటి వరకూ బంగారం వినియోగంలో భారత దేశం ప్రపంచంలోనే రెండవ స్థానంలో ఉంది. ఏటా 850 టన్నుల బంగారాన్ని… 8000 టన్నుల వెండిని భారతీయలు వినియోగిస్తున్నారు. తాజాగా బంగారం ధరతో వెండి ధర కూడా తీవ్ర పోటీ ఇస్తోంది. 2025 డిసెంబర్ 18న హైదరాబాద్ , విజయవాడలో కిలో వెండి ధర సుమారు రూ.2,24,000కు చేరింది. అంటే రూ.2,000 పెరిగింది. ఢిల్లీ, ముంబై నగరాల్లో కిలో వెండి ధర సుమారు రూ.2,11,000 గా నమోదైంది.
